ఆయుష్మాన్ భారత్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం మిళితం, ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో తెలంగాణ సీఎస్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని మిళితం చేయడానికి నిర్ణయం..

ఆయుష్మాన్ భారత్ లో  రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం మిళితం, ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ లో తెలంగాణ సీఎస్
Follow us

|

Updated on: Dec 30, 2020 | 10:47 PM

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని మిళితం చేయడానికి నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి తెలియజేశారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్. భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆయుష్మాన్ భారత్ , ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన , జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించింది.. తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించిందని సోమేశ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు.