తెలంగాణ ప్రజలకు ఊరట..మరింత పకడ్బందీగా ఆరోగ్య శ్రీ

పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మేలు చేసే విధంగా పలు మార్పులు చేపడుతోంది.

తెలంగాణ ప్రజలకు ఊరట..మరింత పకడ్బందీగా ఆరోగ్య శ్రీ
Follow us

|

Updated on: Oct 05, 2020 | 8:38 PM

పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత మేలు చేసే విధంగా పలు మార్పులు చేపడుతోంది. ఈమేరకు మంత్రి ఈటల పలు కీలక విషయాలను వెల్లడించారు.

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని మరింత పకడ్బందీగా అమలు చేస్తామని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తున్నామని చెప్పారు.

కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లిన ఏ ఒక్క రోగి కూడా వెనక్కి తిరిగి రాకుండా, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులైన పేదలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చికిత్స అందిస్తామన్నారు. అందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. కరోనా తీవ్రత, కేసులు తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేకుంటే కేరళ అనుభవాలను ఎదుర్కోక తప్పదన్నారు. కేరళలో ఓనమ్‌ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఒక్కసారిగా కొవిడ్‌ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోనూ బతుకమ్మ, దసరా పెద్ద పండుగలు. ఈ రెండు పండుగల్లో ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.