టీన్స్‌ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టిన తెలంగాణ షీటీమ్స్‌

తెలంగాణ పోలీసులు కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు. సైబర్‌ నేరాలు, భద్రతపై వారికి ఉన్న అవగాహనను అధ్యయనం చేసేందుకు తెలంగాణ షీటీమ్స్‌ ‘టీన్స్‌ ఆన్‌లైన్‌ సర్వే’ను చేపట్టింది,

టీన్స్‌ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టిన తెలంగాణ షీటీమ్స్‌
Follow us

|

Updated on: Jun 21, 2020 | 2:15 PM

రూటుమార్చిన సైబర్‌ కేటుగాళ్లు ట్రెండ్‌ను ఫాలో అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. కరోనా లాక్‌డౌన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మనిషి బలహీనతలను గుర్తించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ఆహారం, మద్యం, ఖరీదైన వస్తువుల విక్రయం, ఆఫర్ల పేరిట దోచేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్న దానిని ఎరగా ఆన్‌లైన్‌లో నేరాలకు పాల్పడుతున్నారు. లాక్‌డౌన్‌లోనే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు 86 శాతం పెరిగినట్టు పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ల భరతం పట్టేందుకు రెడీ అవుతున్నారు. సైబర్‌ నేరాలు, భద్రతపై వారికి ఉన్న అవగాహనను అధ్యయనం చేసేందుకు తెలంగాణ షీటీమ్స్‌ ‘టీన్స్‌ ఆన్‌లైన్‌ సర్వే’ను ప్రారంభించింది. ఇంట్లో ఇంటర్నెట్‌ వినియోగం, సైబర్‌ భద్రత తదితర అంశాలపై పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారిని అలర్ట్ చేస్తూ వారి నుంచి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫ్లాన్ చేసింది షీటీమ్స్. సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడ జాగ్రత్తగా ఉండాలని చూచిస్తున్నారు.