అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర.. ఇక అంతా గతమే..

ఉమ్మడి రాష్ట్రలో ఆ భవనాలు ఎంతో కళను సంతరించుకున్నాయి. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు సేవలందించాయి. ఎందరో ముఖ్యమంత్రులు, మరెందరో ఉన్నధికారులు అందులో నడయాడుతూ రాష్ట్ర పాలన సాగించారు. ప్రజల కష్ట సుఖాలకు సంబంధించిన ఎన్నో జీవోలు జారీ అయ్యాయి. చివరికి రాష్ట్ర విభజనలో కూడా ఆ భవనాల ప్రాధాన్యత మరువలేనిది. అదే సెక్రెటేరియట్ భవనం. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంగాను.. విభజన తర్వాత తెలంగాణ సచివాలయంగాను సేవలందించిన భవనం చరిత్రలో మిగిలిపోనుంది. చరిత్రకు ఆనవాళ్లుగా ఎన్నో […]

అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర.. ఇక అంతా గతమే..
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 11:47 AM

ఉమ్మడి రాష్ట్రలో ఆ భవనాలు ఎంతో కళను సంతరించుకున్నాయి. దశాబ్దాల తరబడి తెలుగు ప్రజలకు సేవలందించాయి. ఎందరో ముఖ్యమంత్రులు, మరెందరో ఉన్నధికారులు అందులో నడయాడుతూ రాష్ట్ర పాలన సాగించారు. ప్రజల కష్ట సుఖాలకు సంబంధించిన ఎన్నో జీవోలు జారీ అయ్యాయి. చివరికి రాష్ట్ర విభజనలో కూడా ఆ భవనాల ప్రాధాన్యత మరువలేనిది. అదే సెక్రెటేరియట్ భవనం. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంగాను.. విభజన తర్వాత తెలంగాణ సచివాలయంగాను సేవలందించిన భవనం చరిత్రలో మిగిలిపోనుంది.

చరిత్రకు ఆనవాళ్లుగా ఎన్నో కట్టడాలు మన కళ్లముందు సజీవంగా నిలిచి ఉన్నాయి. వాటిని చూసినప్పుడు ఒకనాడు ఎంతో ఘనంగా సాగిన ఆనాటి ఙ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం. మన హైదరాబాద్ నగరంలో ఇటువంటివి ఎన్నో కట్టడాలు మనకు కనిపిస్తుంటాయి. అవన్ని చరిత్ర పుటల్లో పాఠ్యపుస్తకాల్లో నిలిచిపోయాయి. సరిగ్గా అదే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా అదే లెక్కలోకి రాబోతుంది. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, అధికారులతో నిత్యం సందడిగా కనిపించిన సెక్రటేరియట్ భవనం ఇప్పడు కళావిహీనంగా కనిపిస్తోంది. దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సెక్రెటేరియట్ నిర్మాణం చేపట్టడమే. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ భవనానికి రావడం రాకుండా పరిపాలన చేపట్టారు. దీంతో ఈ భవనం కళతప్పి ఒంటిరిగా కనిపిస్తోంది.

ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్ర సెక్రెటేరియట్‌ను మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం భావించింది. ఇప్పటికే దీని మార్పునకు సంబంధించి ఆ పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనానికి అధికారులు, ఫైళ్లు కూడ తరలిపోయాయి. దీంతో ఇక పాత భవనం వైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారు. ఇప్పటికే అన్ని డిపార్ట్‌మెంట్లు తాత్కాలిక భవనంలోకి తరలిపోవడంతో రేపు (ఆదివారం) పాత సెక్రెటేరియట్‌కి తాళం వేయనున్నట్టు తెలుస్తోంది.

ఎంతోమంది ముఖ్యమంత్రులు

1952 లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు నుంచి మొదలు.. అటు తర్వాత 1956లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయం సేవలందించింది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా సచివాలయం నుంచి ప్రజాపాలన చేసినవారిలో నీలం సంజీవరెడ్డి ( 1956-60), దామోదరం సంజీవయ్య, మళ్లీ రెండోసారి 1964లో నీలం సంజీవరెడ్డి , కాసు బ్రహ్మనందరెడ్డి, పీవీ నరసింహారావు(1971-73) జలగం వెంగళరావు (1973-78), డా. మర్రి చెన్నారెడ్డి(1978-80), టంగుటూరి అంజయ్య(1980-82),భవనం వెంకట్రామ రెడ్డి(1982 ఫిబ్రవరి 24-సెప్టెంబర్ 20),కోట్ల విజయభాస్కర్ రెడ్డి(1982 సెప్టెంబర్20-1983, జనవరి 9), ఎన్టీ రామారావు(1983-84 ), నాదెండ్ల భాస్కరరావు(1984 ఆగస్టు 16-1984 సెప్టెంబర్ 16 ),మళ్లీ ఎన్టీఆర్(1984-1985 ),మళ్లీ ఎన్టీఆర్(1985-1989),మర్రి చెన్నారెడ్డి(1989-90 ),నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి(1990-92),కోట్ల విజయభాస్కర్ రెడ్డి(1992-94),ఎన్టీఆర్(1994-95),చంద్రబాబు నాయుడు (1995-2004 ),వైఎస్ రాజశేఖర్ రెడ్డి(2004-2009 ),కొణిజేటి రోశయ్య(2009-10)కిరణ్ కుమార్ రెడ్డి(2010-2014) వీరంతా ఇక్కడే తమ ప్రజాపాలనను అందించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-19 వరకు ఈ సచివాలయం నుంచే పాలన కొనసాగినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం ఇక్కడికి రాలేదు.

కొత్త భవన నిర్మాణం

వాస్తుపై విపరీతమైన నమ్మకమున్న సీఎం కేసీఆర్ ఈ సచివాలయానికి రాకుండా ఆయన అధికారిక నివాసమైన ప్రగతిభవన్‌ నుంచి రాష్ట్ర పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం భవనాలు సరిగ్గా పాలనకు అనుకూలంగా లేవని,ముఖ్యంగా వాస్తుకు సరిపోవడం లేదనే కారణంతో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దీంతో ఇందులో ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర పాలను సంబంధించిన ఫైళ్లను తాత్కాలికంగా ఆ పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనానికి తరలించారు. సచివాలయ ఉద్యోగులు సైతం ఇక్కడి నుంచే తమ విధులను నిర్వహిస్తున్నారు.

Telangana secretariat creats History now is will change as new building

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడక ముందు నుంచి, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నసమయంలోనే ఈ పాత సచివాలయం నుంచి పాలన సాగింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భవనాలను కూల్చివేసి నూతన భవనాన్ని నిర్మిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటి వరకు అర్ధ శతాబ్దానికి పైగా సేవలందించిన చరిత్రకు ఈ సెక్రెటేరియట్ ఒక పాత ఙ్ఞాపకంగా మిలిగిపోనుంది అంటే ఆశ్యర్యం లేదు.