పండక్కి ఊరెళదామనుకుంటున్నారా ? అయితే మీకు షాకే.. !!

దసరా పండగకు ఆర్టీసీ సిద్ధమైంది. నగరవాసులను సొంతూళ్లకు చేరవేసేందుకు ప్రణాళిక కూడా రెడీ అయింది. పండుగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూర్, ముంబై, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు 4,933 ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంజీబీఎస్, సీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్లతో పాటు లింగంపల్లి, చందానగర్, కేసీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్ పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ ఎల్‌బీనగర్‌ ప్రాంతాల నుంచి బస్సులు […]

పండక్కి ఊరెళదామనుకుంటున్నారా ? అయితే మీకు షాకే.. !!
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2019 | 12:25 PM

దసరా పండగకు ఆర్టీసీ సిద్ధమైంది. నగరవాసులను సొంతూళ్లకు చేరవేసేందుకు ప్రణాళిక కూడా రెడీ అయింది. పండుగ రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూర్, ముంబై, చెన్నై, షిరిడీ తదితర ప్రాంతాలకు 4,933 ప్రత్యేక బస్సులను నడిపేందుకు కార్యచరణ సిద్ధం చేసింది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంజీబీఎస్, సీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్లతో పాటు లింగంపల్లి, చందానగర్, కేసీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్ పేట్, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌ ఎల్‌బీనగర్‌ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఇక నగర శివారుల్లో నివసించే ప్రయాణికుల కోసం బస్సులను నేరుగా ఆయా కాలనీల నుంచే నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది. పండగ సెలవులు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 27 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ తెలిపారు.

అయితే అధికారుల ప్రణాళికను ఆర్టీసీ కార్మిక సంఘాలు పాటించేలా కనిపించడం లేదు. సమ్మె సైరన్ మోగించేందుకు సిద్దవుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రెండు జేఏసీలు ఏర్పటైనట్లు తెలుస్తోంది. వేలాది మంది కార్మికుల భద్రత, ఆర్టీసీ పరిరక్షణ కోసం సమ్మె చేపడతామని ఇప్పటికే జేఏసీలు ప్రకటించాయి. ఈ నెల 27 తర్వాత తామే సమ్మెకు దిగనున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. దీంతో దసరా బస్సుల నిర్వహణ పై సందిగ్దత నెలకొంది. సమ్మె అనివార్యం అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
ఉద్యోగం వదిలేసి పందుల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్న యువతి
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలో సూపర్‌హిట్ థ్రిల్లర్..ఎక్కడ చూడొచ్చంటే?
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా