Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 90 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 190535. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 93322. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 91819. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5394. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • శ్రీవారి లడ్డూ కోసం రెండో రోజూ హైదరాబాద్ లో క్యూలైన్లు . భక్తులకు 10 నుంచి 15 లడ్డూలు మాత్రమే ఇస్తున్న టిటిడి. తిరుమల నుంచి ఈ రోజు మధ్యాహ్నానికి చేరుకోనున్న మరో యాభైవేల లడ్డూలు. నిన్న ఈరోజు 60వేలు లడ్డుల విక్రయించిన హిమాయత్ నగర్ టీటీడీ కళ్యాణ మండపం.
  • జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో 3 మంది ఉగ్రవాదులు మృతి.
  • విశాఖ నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కన్యాకుమారి, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి రుతుపవనాల ఆగమనం అరేబియా సముద్రంలోని ఆగ్నేయ, తూర్పు మధ్య ప్రాంతాల్లో బలపడుతున్న అల్పపీడనం, ఇది ఈనెల మూడు నాటికి తుపానుగా మారి మహారాష్ట్ర, గుజరాత్ ల మీదికి ప్రయాణిస్తుందని అంచనా తెలంగాణ ,కోస్తాంధ్రలలో నేడు కూడా కొనసాగనున్న గాలివానలు.
  • విజయవాడ: రైల్వే డివిజన్ గుంటూరు నుండి సికింద్రాబాద్ కి బయలుదేరిన గిల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్. గుంటూరు నుండి వయ విజయవాడ, వారంగల్ మీదగా సికింద్రాబాద్ చేరుకోనున్న ట్రైన్. ఇంటర్ స్టేట్ ట్రైన్ ప్రయాణాన్ని తాత్కాలికంగా ఆపిన రైల్వేశాఖ. ఇంటర్ స్టేట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ టికెట్లు క్యాన్సల్ చేయబడ్డాయి. రిజర్వేషన్ పూర్తి మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వనున్న రైల్వేశాఖ. ఇంటర్ స్టేట్ సర్వీసులు ఎప్పటినుండి మొదలుకనున్నాయో త్వరలోనే ప్రకటించనున్న రైల్వేశాఖ.
  • ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్. 2 వారాల క్రితం ముంబై నుండి డిల్లీకి వచ్చిన ఐసిఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైంటిస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సైoటిస్ట్. ICMR HQ లలో సమావేశం కోసం ఢిల్లీ కి వచ్చినట్లు అధికారులు వెల్లడి. భవనాన్ని శాని టైజేషన్ చేస్తున్న అధికారులు.

హైదరాబాద్ లో సిటీ బస్సులు.. కానీ వారికోసం మాత్రమే..!

Telangana RTC special buses for government employees in Hyderabad, హైదరాబాద్ లో సిటీ బస్సులు.. కానీ వారికోసం మాత్రమే..!

కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ లోకి వెళ్లిన సంస్థలు ఒక్కొక్కటిగా కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సర్కార్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కొనసాగాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేందుకు వీలుగా శనివారం నుంచి హైదరాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. నగరంలోని వివిధ చోట్ల నుంచి కార్యాలయాలకు వచ్చేవారికి బస్సు సౌకర్యం కల్పించామన్నారు. మొత్తం 32 మార్గాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు బస్సు సౌకర్యం ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యోగులు గుర్తింపు కార్డులు చూపి బస్సులోకి ఎక్కాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సౌకర్యంపై టీఎన్జీవో ఉద్యోగుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి.

Related Tags