హైదరాబాదీలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్

తెలంగాణలో పెద్ద పండుగా జరుపుకునే దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు.

  • Sanjay Kasula
  • Publish Date - 11:11 pm, Mon, 19 October 20

Special Buses From Hyderabad : హైదరాబాదీలకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో పెద్ద పండుగా జరుపుకునే దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్‌ఎం వరప్రసాద్ తెలిపారు.

ఈ నెల 15 నుంచి 24 వరకు దసరా ప్రత్యేక బస్సులు నడుపుతామని వెల్లడించారు. హైదరాబాద్‌‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎస్సార్‌‌నగర్‌, అమీర్‌పేట్‌, ఈసీఐఎల్‌, ఉప్పల్‌ క్రాస్‌రోడ్, ఎల్బీ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరతాయని వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ కల్పించామని వరప్రసాద్ తెలిపారు.

మరోవైపు ఏటా దసరా సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు నడిపేవారు. ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ‘అంత ర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం’ జరగకపోవడంతో బస్సుల రవాణాకు కొంత బ్రేక్‌ పడింది.