తెలంగాణలో 27 వేల మార్క్‌ దాటిన కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 1,879 కరోనా పాజిటివ్ కేసులు..

  • Tv9 Telugu
  • Publish Date - 10:57 pm, Tue, 7 July 20
తెలంగాణలో 27 వేల మార్క్‌ దాటిన కేసులు..

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 1,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27,612కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య313కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 11,012 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 16,287 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదవుతున్నాయి. మంగళవారం నాడు నమోదైన పాజిటివ్ కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే 1,422 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కాగా, దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు రోజు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి నమోదవుతున్నాయి.