బల్దియా ఫైట్‌లో దేత్తడి అంటున్న రాజకీయ పార్టీలు.. ముగిసిన నామినేషన్ల ఘట్టం

బల్దియా ఫైట్‌లో రాజకీయ పార్టీలు దేత్తడి అంటున్నాయి. అభివృద్ధి మంత్రం టీఆర్ఎస్‌ జపిస్తుంటే, సెంటిమెంట్‌ అస్త్రం బయటకు తీసింది బీజేపీ. బస్తీమే సవాల్‌ అంటూ కమలనాథులు అని అంటుంటే, ఆరేళ్లలో హదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి అంటూ గులాబీ ప్రశ్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం కోసం జరుగుతున్న యుద్దంలో- ముఖ్యంగా ఏయే అంశాలు ఫోకస్‌ అవుతున్నాయి? వాస్తవానికి ఓటర్‌ కోరుకుంటున్నదేమిటి? పార్టీలు మాట్లాడుతున్నది ఏంటి? అన్నదే ఇప్పుడు చౌరస్తాలో చర్చనీయాంశం అయింది. ఈ మధ్యాహ్నం 3 గంటలతో […]

  • Venkata Narayana
  • Publish Date - 3:14 pm, Fri, 20 November 20
బల్దియా ఫైట్‌లో దేత్తడి అంటున్న రాజకీయ పార్టీలు.. ముగిసిన నామినేషన్ల ఘట్టం

బల్దియా ఫైట్‌లో రాజకీయ పార్టీలు దేత్తడి అంటున్నాయి. అభివృద్ధి మంత్రం టీఆర్ఎస్‌ జపిస్తుంటే, సెంటిమెంట్‌ అస్త్రం బయటకు తీసింది బీజేపీ. బస్తీమే సవాల్‌ అంటూ కమలనాథులు అని అంటుంటే, ఆరేళ్లలో హదరాబాద్‌కు ఏం చేశారో చెప్పండి అంటూ గులాబీ ప్రశ్నిస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పీఠం కోసం జరుగుతున్న యుద్దంలో- ముఖ్యంగా ఏయే అంశాలు ఫోకస్‌ అవుతున్నాయి? వాస్తవానికి ఓటర్‌ కోరుకుంటున్నదేమిటి? పార్టీలు మాట్లాడుతున్నది ఏంటి? అన్నదే ఇప్పుడు చౌరస్తాలో చర్చనీయాంశం అయింది. ఈ మధ్యాహ్నం 3 గంటలతో అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో ఇక గల్లీల్లో- తూతూ మైమై అంటున్నాయి పార్టీలు. పార్టీల జెండాలు.. గ్రేటర్‌ అజెండాపై తగవులాడుతున్నాయి. 2016నాటి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు, ఈ ఎన్నికలకు తేడా చాలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో హైదరాబాద్‌ అభివృద్ధి- టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అవసరం అన్న కోణంలో జరిగాయి. ఈసారి సీన్‌ మారింది. హైదరాబాద్‌కి వరద సాయం ఈ ఎన్నికల్లో ఫోకస్‌ అవుతోంది. హైదరాబాద్‌ను కేంద్రం ఆదుకోలేదనీ, రాష్ట్ర ప్రభుత్వమే 500 కోట్లు ప్రకటించిందనీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. వరదలొచ్చిన నెలరోజుల తర్వాత కేంద్ర బృందం వచ్చిందని విమర్శించారు. గల్లీల్లో ఉండేది గులాబీ జెండా అనీ, కాషాయజెండా కాదన్నారు. వరద బాధితులకు తాము పదివేల రూపాయల సాయం ఇస్తుంటే, బీజేపీ నేతలు అడ్డుకున్నారని గులాబీ గుస్సా అయింది. ఈ ఆరోపణలను ఖండించిన బండి సంజయ్‌ తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వరద బాధిత కుటుంబానికి 25వేల రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు.