ఒడిశాలో తెలంగాణ పోలీసులపై దాడి

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో పాలుపంచుకున్న వారిలో ఓ నిందితుడు ఒడిశాలోని గంజాం జిల్లా ప్రాంతానికి చెందినవాడుగా తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. అతడిని పట్టుకునేందుకు 11 మందితో కూడిన టీమ్ రెండు వాహనాల్లో ఒడిశా వెళ్లింది. గురువారం సివిల్ డ్రెస్సుల్లో వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వారంతా పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చారని అనుకుని దాడికి పాల్పడ్డాడు. పోలీసులపై పిడిగుద్దులు కురిపించి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం […]

ఒడిశాలో తెలంగాణ పోలీసులపై దాడి
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 3:28 PM

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో పాలుపంచుకున్న వారిలో ఓ నిందితుడు ఒడిశాలోని గంజాం జిల్లా ప్రాంతానికి చెందినవాడుగా తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. అతడిని పట్టుకునేందుకు 11 మందితో కూడిన టీమ్ రెండు వాహనాల్లో ఒడిశా వెళ్లింది. గురువారం సివిల్ డ్రెస్సుల్లో వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిపై గ్రామస్థులకు అనుమానం వచ్చింది. వారంతా పిల్లలను కిడ్నాప్ చేసేందుకు వచ్చారని అనుకుని దాడికి పాల్పడ్డాడు. పోలీసులపై పిడిగుద్దులు కురిపించి వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం వారందరినీ సుమారు గంటసేపు నిర్బంధించారు.

విషయం తెలుసుకున్న పటాపూర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్‌పెక్టర్ రమేశ్ చంద్ర ప్రధాన్ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని తెలంగాణ పోలీసులను రక్షించారు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు ఎలాంటి కంప్లైంట్ చేయలేదని ఆయన తెలిపారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు నిందితుడి ఇంటిపై రైడ్ చేసి కొంత నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.