నిబంధనలు అతిక్రమించే పోలీసులపై ఫిర్యాదు చేయండిలా..!

పోలీసులకు రక్షక భటులని పేరు. ఒక్కోసారి వారుకూడా నిబంధనలు అతిక్రమించడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. దురుసుగా ప్రవర్తించడం, కారణం లేకుండా చేయి చేసుకోవడం, లంచాలు డిమాండ్ చేయడం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఖాకీలపై అప్పుడప్పుడూ వార్తల్లో వస్తుంటాయి. మరి వీరిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధంకాక సామాన్యుడు తన ఆగ్రహాన్ని , ఆవేశాన్ని పంటికిందే అదిమిపెట్టుకుని మౌనంగా ఉండిపోతాడు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు సేవలు […]

నిబంధనలు అతిక్రమించే  పోలీసులపై ఫిర్యాదు చేయండిలా..!
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 6:15 PM

పోలీసులకు రక్షక భటులని పేరు. ఒక్కోసారి వారుకూడా నిబంధనలు అతిక్రమించడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. దురుసుగా ప్రవర్తించడం, కారణం లేకుండా చేయి చేసుకోవడం, లంచాలు డిమాండ్ చేయడం, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు ఖాకీలపై అప్పుడప్పుడూ వార్తల్లో వస్తుంటాయి. మరి వీరిపై ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధంకాక సామాన్యుడు తన ఆగ్రహాన్ని , ఆవేశాన్ని పంటికిందే అదిమిపెట్టుకుని మౌనంగా ఉండిపోతాడు.

పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది తెలంగాణ పోలీస్ శాఖ. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన వారి బాధను పూర్తిగా వింటూనే వారికి తాగిన రక్షణగా నిలుస్తూ మేమున్నామనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో కొన్ని డిపార్డ్‌మెంట్‌లో అవాంఛనీయ పరిస్థితులపై కూడా సీరియస్‌గా ఉండాలని నిర్ణయించింది. సాధారణ పౌరులు రూల్స్ అతిక్రమిస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మరి పోలీసులే రూల్స్ అతిక్రమిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? అనే ప్రశ్న దాదాపు అందరికీ వస్తుంది. దీనిపై తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ” హ్యాక్ ఐ”లో మరో పేజీ కేటాయించారు. దీనిద్వారా పోలీసులు ఎవరినైనా అకారణంగా ఇబ్బందులకు గురిచేసినా, లేక నిబంధనలు అతిక్రమించినా వెంటనే ఈ యాప్‌లో ఉన్న మరో ఆప్షన్ ‌ద్వారా పై అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

“హ్యాక్ ఐ” మొబైల్ యాప్‌లో “వయోలేషన్ బై పోలీస్” అనే ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ ఎవరైనా సరే ఫిర్యాదును నేరుగా రిపోర్టు చేయవచ్చు. ఫిర్యాదుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సహా ఆధారాలు జత చేసే వీలుకూడా ఇందులో ఉంది. ఈ యాప్‌లో నమోదైన ఫిర్యాదులన్నీ పోలీసు ఉన్నతాధికారులకు నేరుగా చేరుతాయని గనుక విచారణ కూడా వేగంగానే జరుగుతుందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. సో.. ఇకపై సామాన్యులపైనే కాదు.. నిబంధనలు అతిక్రమించిన పోలీసులపై కూడా ఫిర్యాదు చేయొచ్చు.

మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !
హర హర మహాదేవ.. అమర్‌నాథ్ యాత్రకు ఇలా దరఖాస్తు చేసుకోండి.. !