Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం… పోలీసుల వలలో అంతరాష్ట్ర ముఠా!

Telangana: Police bust brothel house five arrested, హైదరాబాద్‌లో హైటెక్ వ్యభిచారం… పోలీసుల వలలో అంతరాష్ట్ర ముఠా!

హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాలు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా మారుతున్నాయి. పొరుగు రాష్ట్రాలతోపాటు విదేశీ వనితలతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలను యధేచ్చగా నిర్వహిస్తూ అశ్లీల దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోన్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు హైటెక్ పద్దతిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన రజియా, ఆమె భర్త సిరాజుద్దీన్‌లు ఈ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా సాగుతోన్న ఈ ముఠా కార్యకలాపాల గురించి పక్కగా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం వారి ఫ్లాట్‌పై దాడిచేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులతో పాటు పలువురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన నలుగురు మహిళలు కూడా పట్టుబడ్డారు. వారి దగ్గర నుంచి రూ.6,580 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, 36 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సెక్షన్ 370A,పిటా ఎక్ట్ కింద కేసు నమోదుచేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఆపరేషన్‌లో మల్కాజిగిరి ఎస్ఓటీ, నెరేడ్‌మెట్ పోలీసుల సంయుక్తంగా నిర్వహించారు.

గత నెలలోనే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మనుషుల అక్రమ రవాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రవాణాకు అడ్డుకట్ట వేసింది. బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిలను అక్రమంగా తీసుకొచ్చి వారితో గుట్టుగా వ్యభిచారం చేయిస్తున్న ముఠాను ఛత్రినాక పోలీసుల సాయంతో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ ఇలాంటి కేసు నమోదు చేయడం ఇదే తొలిసారి. పాతబస్తీకి చెందిన యూసుఫ్‌ ఖాన్‌, అతడి భార్య బేగంను ఈ కేసులో ప్రధాన నిందితులు. బంగ్లాదేశ్‌ నుంచి ఐదుగురు యువతులను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా ప్రణాళికతో దాడి చేసిన ఎన్‌ఐఏ అధికారులు ముఠా సభ్యులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతులను వారి దేశానికి తిప్పి పంపారు.

Related Tags