తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు: కేటీఆర్

Telangana Parishad Election Results, తెలంగాణ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు: కేటీఆర్

దేశ చరిత్రలో ఏ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చరిత్రాత్మక తీర్పును ఇచ్చారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అసాధారణ, అఖండ విజయం సాధించిందని.. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లా పరిషత్ పీఠాలను ఏకపక్షంగా కైవసం చేసుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ ఫలితాల ద్వారా ప్రజలు కేసీఆర్ నాయకత్వానికి మరోసారి జై కొట్టారని.. వారందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఈ గెలుపుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని.. విజయాన్ని ఆస్వాదిస్తూనే మరింత కష్టపడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. గెలిచామని పొంగిపోవడం, ఓడామని కుంగిపోవడం టీఆర్ఎస్ చరిత్రలో లేదని.. గెలిచినా, ఓడినా తమ పార్టీ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని తెలిపారు. కాగా మంగళవారం విడుదలైన పరిషత్ ఎన్నికల ఫలితాల్లో 3,556 ఎంపీటీసీ.. 446 జెడ్పిటీసీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *