RIP Arun Jaitley: రైతు రుణ మాఫీ ఘనత తెలంగాణదే.. నాడు జైట్లీ

తెలంగాణపై దివంగత బీజేపీ నేత, మాజీ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి ఉన్న అభిమానం అంతాఇంతా కాదు. రైతు రుణాల మాఫీని విజయవంతంగా అమలు చేసి తన హామీని నెరవేర్చిన ఘనత అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణకే దక్కుతుందని ఆయన నాడు వ్యాఖ్యానించారు. ఇది 2018 డిసెంబరు నాటి మాట.. నాడు 36 లక్షలమంది రైతులకు సంబంధించి 17 వేల కోట్ల మేర రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా మాఫీ చేసి తన ఎన్నికల నాటి హామీని నెరవేర్చింది. […]

RIP Arun Jaitley: రైతు రుణ మాఫీ ఘనత తెలంగాణదే.. నాడు జైట్లీ
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 2:40 PM

తెలంగాణపై దివంగత బీజేపీ నేత, మాజీ ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి ఉన్న అభిమానం అంతాఇంతా కాదు. రైతు రుణాల మాఫీని విజయవంతంగా అమలు చేసి తన హామీని నెరవేర్చిన ఘనత అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణకే దక్కుతుందని ఆయన నాడు వ్యాఖ్యానించారు. ఇది 2018 డిసెంబరు నాటి మాట.. నాడు 36 లక్షలమంది రైతులకు సంబంధించి 17 వేల కోట్ల మేర రుణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా మాఫీ చేసి తన ఎన్నికల నాటి హామీని నెరవేర్చింది. అయితే కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఇలాంటి వాగ్దానం చేసినా నెరవేర్చలేకపోయాయి. జీఎస్టీ అమలులోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రమే ముందుందని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఢిల్లీలో 2018 డిసెంబరు 22 న జరిగిన జీఎస్టీ మండలి 31 వ సమావేశంలో పాల్గొన్న జైట్లీ.. ఆ సందర్భంగా తెలంగాణ మాజీ ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ చేసిన కృషిని ప్రశంసించారు. రాష్ట్రంలో లక్ష మేర రైతు రుణాలను మాఫీ చేసిన ఫలితంగా ప్రభుత్వంపై రూ. 24 వేల కోట్ల భారం పడింది. అయితే తెరాస ప్రభుత్వం ఈ భారాన్ని పట్టించుకోకుండా రుణమాఫీ చేసిందని జైట్లీ అన్నారు.పైగా.. హైదరాబాద్ తెలంగాణకే దక్కుతుందని కూడా నాడు ఆయన వాదించారు. హైదరాబాద్ ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచాలనడం సరికాదని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. ఈ రకంగా అరుణ్ జైట్లీ.. తెలంగాణ ఏర్పాటులో తనవంతు పాత్ర పోషించారు.