టెన్త్ విద్యార్థులకు ముఖ్య గమనిక..! ఆన్‌లైన్ పాఠాల టైంటేబుల్

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ రెండో సంవత్సరం టైం టేబుల్ విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ తాజాగా

టెన్త్ విద్యార్థులకు ముఖ్య గమనిక..! ఆన్‌లైన్ పాఠాల టైంటేబుల్
Follow us

|

Updated on: Aug 30, 2020 | 4:49 PM

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే ఇంటర్ రెండో సంవత్సరం టైం టేబుల్ విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ తాజాగా పదో తరగతి విద్యార్థుల ఆన్‌లైన్ పాఠాల టైంటేబుల్ ను రిలీజ్ చేసింది.

పదవ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటలకు తెలుగు, 10 గంటల 30 నిమిషాలకు ఫిజికల్ సైన్స్.

9వ తరగతి సాయంత్రం 4 గంటలకు తెలుగు, సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ఫిజికల్ సైన్స్.

8వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 3గంటలకు తెలుగు, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు గణితం.

7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటలకు తెలుగు, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు గణితం.

6వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు తెలుగు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు గణితం పాఠాలు ప్రసారం కానున్నాయి. ఈ టైం టేబుల్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకేనని విద్యాశాఖ తెలిపింది.