Breaking News
  • వరంగల్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు. గొర్రెకుంటలో తొమ్మిదిమందిని జలసమాధి చేసిన మానవ మృగం సంజయ్ కుమార్ యాదవ్ కి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడి చేసిన జిల్లా సెషెన్స్ జడ్జ్ జయకుమార్. ఉరిశిక్ష విధించడం పట్ల హర్షం వ్యక్తంచేసిన న్యాయవాదులు, జిల్లా ప్రజలు.
  • ఢిల్లీ: తెలంగాణలో సచివాలయం కూల్చివేత. నిర్మాణాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు. సచివాలయ కూల్చివేత, నిర్మాణానికి అనుమతిస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే కోరిన పిటిషనర్‌. హైకోర్టు తీర్పుపై స్టేకు నిరాకరిస్తూ పిటిషన్‌ కొట్టివేత. ఎన్జీటీలో లేవనెత్తిన అంశాలకు హైకోర్టు తీర్పు అడ్డురాదన్న సుప్రీం.
  • విజయవాడ: రాజకీయ పార్టీలతో ముగిసిన ఎన్నికల కమిషన్‌ భేటీ. కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరిన మెజార్టీ పార్టీలు. ఎన్నికల కమిషన్‌ భేటీకి 19 పార్టీలకి ఆహ్వానం..హాజరైన 11 పార్టీలు. భేటీకి హాజరుకాని వైసీపీ. మెయిల్‌ ద్వారా అభిప్రాయాన్ని తెలిపిన జనసేన. ప్రెస్‌నోట్‌ విడుదల చేయనున్న నిమ్మగడ్డ రమేష్‌.
  • అమరావతి: అనంతపురం పోలీసులను అభినందించిన డీజీపీ సవాంగ్. కిడ్నాపర్ల చెర నుంచి వైద్యుడిని కాపాడిన అనంతపురం పోలీసులు. నేరాల నియంత్రణలో ఏపీ పోలీసుల పనితీరుకు ఈ ఘటన ఒక ఉదాహరణ. ప్రజల రక్షణ కోసం ఏపీ పోలీసులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. -ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్.
  • కరీంనగర్‌: జమ్మికుంట మండలంలో మంత్రి ఈటల పర్యటన. జగయ్యపల్లెలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. రైతు తెచ్చిన ధాన్యాన్ని ఇబ్బందులు పెట్టకుండా దిగుమతి చేసుకోవాలి. రైతులు, మిల్లుల యజమాన్యాలు పరస్పరం సహకరించుకోవాలి. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు-ఈటల.
  • హైదరాబాద్‌: గాంధీనగర్‌ పీఎస్‌లో ఏసీబీ సోదాలు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై లక్ష్మీనారాయణ.
  • వికారాబాద్:దామగూడెంలో ఫామ్ హౌజ్‌ను పరిశీలించిన డీఎస్పీ శ్రీనివాస్‌. నిర్వాహకుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు. ఆవుపై కాల్పులు జరిపిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు. గోమాతపై కాల్పుల వెనుక కుట్ర కోణం ఉందంటూ స్వామీజీల ఆగ్రహం. రెండు రోజుల్లో నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ హామీ.
  • జగిత్యాల: యువతి హత్య కేసులో ముగ్గురికి జీవితఖైదు. ముగ్గురికి జీవితఖైదు విధించిన జగిత్యాల జిల్లా అదనపు కోర్టు. 2015లో ఎన్గుమట్లలో మౌనశ్రీని హత్యచేసిన కుటుంబం.

ఎ౦పి టికెట్లు ఆశిస్తున్న పలువురు తెల౦గాణ ఎన్నారైలు

, ఎ౦పి టికెట్లు ఆశిస్తున్న పలువురు తెల౦గాణ ఎన్నారైలు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణ౦లో పలువురు తెలంగాణ ఎన్నారైలు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమకు పార్టీ టికెట్ కావాలని కోరుతూ పలువురు ఎన్నారైలు దరఖాస్తులు సమర్పించారు.

తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలుండగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీల తరపున ఎన్నికల బరిలోకి దిగేందుకు పలువురు ఎన్నారైలు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎన్నారైలు పార్టీ టికెట్లు ఇస్తే వారే ప్రచార ఖర్చు భరిస్తారని పలు పార్టీలు టికెట్లు వారికి ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ నుంచి ఉత్తం కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. యూకేకు చెందిన మరో ఎన్ఆర్ఐ డాక్టర్ పగిడిపాటి దేవయ్య వర్ధన్నపేట నుంచి తెలంగాణ జనసమితి పక్షాన పోటీ చేసి ఓడిపోయారు.

అమెరికాకుకు చెందిన మరో తెలంగాణ ఎన్ఆర్ఐ జలగం సుధీర్ నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూఎస్ శాఖ సంయుక్త కార్యదర్శి అయిన సుక్రూ నాయక్ కూడా నల్గొండ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. యూకేకు చెందిన గంపా వేణుగోపాల్ మెదక్ కాంగ్రెస్ టికెట్ కోసం యత్నిస్తున్నారు. గల్ప్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన జువ్వాడి శ్రీనివాసరావు చేవేళ్ల లేదా మల్కాజిగిరి సీటు కోసం యత్నిస్తున్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పలువురు తెలంగాణ ఎన్నారైలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

, ఎ౦పి టికెట్లు ఆశిస్తున్న పలువురు తెల౦గాణ ఎన్నారైలు

Related Tags