లండన్‌లో బోనాల జాతర

Bonalu festival in London, లండన్‌లో బోనాల జాతర

లండన్ గడ్డమీద మొట్టమొదటిసారిగా బోనాల కార్యక్రమం నిర్వహించింది వరంగల్ ఎన్ఆర్ఐ ఫోరం. తెలంగాణ సంప్రదాయ పండుగైన బోనాల జాతరను ఘనంగా జరుపుకున్నారు తెలుగువారు. మహిళలు పోచమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ ఎన్‌ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో పోచమ్మ బోనాల జాతర వైభవంగా జరిగింది. స్థానిక ఆడిటోరియంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో.. తెలుగు సంప్రదాయ నృత్యాలతో చిన్నారులు అలరించారు. పాటలు, డ్యాన్సులతో అదరగొట్టారు. మరికొంతమంది బుడతలు.. కలర్‌ఫుల్ డ్రస్సులతో మెరిసిపోయారు.

బోనాల సంబరానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన తెలుగువారు.. అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం.. పసందైన తెలంగాణ వంటకాలను ఆస్వాదిస్తూ ఉత్సాహంగా గడిపారు. కాకతీయ రాజుల వైభవం, ఓరుగల్లు చరిత్ర, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన డాక్యుమెంటరీ విశేషంగా ఆకట్టకుంది. మరోవైపు వరంగల్ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో చేసిన సేవలను కూడా ఈ డాక్యుమెంటరీలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సేకరించిన విరాళాలను.. ఇటీవల వరంగల్‌లో దారుణ హత్యకు గురైన 9 నెలల చిన్నారి కుటుంబానికి అందించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *