Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

టీ సర్కార్ కొత్త పాలసీ.. ఇకపై ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

Telangana Government, టీ సర్కార్ కొత్త పాలసీ.. ఇకపై ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చాక.. ఇసుక విషయంలో నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ పరిధిలోనే ఇసుకను విక్రయిస్తున్నారు. దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా.. ప్రభుత్వమే ఇంటికి ఇసుకను తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఎంత ఇసుక కావాలో ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని.. డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. అయితే రవాణా చార్జీలతో కలుపుకొని టన్నుకు రూ.1350 నుంచి రూ.1450 వరకు ఖర్చు అవుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇంటి దగ్గరకే ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది.

ఖనిజాభివృద్ధి సంస్థ తీసుకున్న ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఇసుక కావాల్సినవారు టీఎస్ఎండీసీకి చెందిన శాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ వెబ్‌సైట్‌‌లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకుని.. ఇసుకను బుక్‌ చేసుకోవచ్చు. ఇసుక సరఫరాకు నగర శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్‌, వట్టినాగులపల్లి, బౌరంపేటల్లో ప్రత్యేకంగా స్టాకు యార్డులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో 1.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను అందుబాటులో ఉంచారు. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి స్టాక్‌ యార్డుల్లో ఇసుకను నిల్వ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇసుక సరఫరాకు వీలుగా వాహనదారులతో ఎండీసీ ప్రత్యేకంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటోంది.

అయితే హైదరాబాద్‌‌లో అవసరాలకు నిజానికి లక్షల టన్నుల ఇసుక కావాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 10 టన్నుల ఇసుకను ఎండీసీ సరఫరా చేసినా.. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణదారులకు ఊరటగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మరోవైపు ప్రతి వర్షాకాలంలో ఇసుక ధరలు పెరుగుతాయి. బ్రోకర్లు కొన్నిసార్లు టన్ను ఇసుకను ఏకంగా రూ.2,000 వరకు కూడా విక్రయిస్తారు. దీంతో వ్యక్తిగత నిర్మాణదారులకు ఇసుక కొనుగోలు భారంగా మారింది. నూతన ఇసుక విధానం అమలైతే ఇసుక ధరల్లో మార్పు లేకుండా సరఫరా అయ్యే అవకాశం ఉంది.

Related Tags