కర్నూల్ రోడ్డు ప్రమాదం బాధితులను ఆదుకుంటాం: తెలంగాణ ఎమ్మెల్యే అబ్రహం

కర్నూల్ జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో 16మంది చనిపోయిన ఘటనపై తెలంగాణ ఎమ్మెల్యే అబ్రహం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా శుభకార్యానికి వెళ్లి వస్తోన్న తుఫాన్ వాహనాన్ని వెల్దుర్తి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 16మంది అక్కడికక్కడే మరణించిన […]

కర్నూల్ రోడ్డు ప్రమాదం బాధితులను ఆదుకుంటాం: తెలంగాణ ఎమ్మెల్యే అబ్రహం
Follow us

| Edited By:

Updated on: May 12, 2019 | 1:18 PM

కర్నూల్ జిల్లా వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో 16మంది చనిపోయిన ఘటనపై తెలంగాణ ఎమ్మెల్యే అబ్రహం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాగా శుభకార్యానికి వెళ్లి వస్తోన్న తుఫాన్ వాహనాన్ని వెల్దుర్తి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 16మంది అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. మృతులలో ఎక్కువగా గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురంకు చెందిన వారే ఉన్నారు.