ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ మంత్రులు

రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది. గవర్నర్ నరసింహన్ ఒక్కొక్క మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజెందర్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:29 pm, Tue, 19 February 19

రాజ్ భవన్ లో మంత్రుల ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరిగింది. గవర్నర్ నరసింహన్ ఒక్కొక్క మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజెందర్, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సింగరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, కేటీఆర్, హరీశ్ రావు, పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.