వీర సైనికుడా.. యావత్తు తెలంగాణ నీకు అండగా నిలుస్తుంది: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ముష్కర మూకలతో జమ్ముకశ్మీర్లో జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ యోధుడు ఆర్ మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వేల్పూర్ వాసిగా తాను అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ మరియ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా మచిల్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ కు మంత్రి […]

వీర సైనికుడా.. యావత్తు తెలంగాణ నీకు అండగా నిలుస్తుంది: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 09, 2020 | 9:51 AM

ముష్కర మూకలతో జమ్ముకశ్మీర్లో జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ యోధుడు ఆర్ మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వేల్పూర్ వాసిగా తాను అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ మరియ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా మచిల్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ కు మంత్రి ఘన నివాళి అర్పించారు. “వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్ చిన్న తనం నుంచే అమితమైన దేశభక్తి… దేశం మీద ప్రేమతో సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది. భౌతికంగా మానుండి దూరమైన బాధ ఉన్నా…దేశం కోసం ప్రాణాలర్పించడం స్ఫూర్తి దాయకం. వీర సైనికుడా యావత్తు తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుంది. మహేష్ త్యాగం వెలకట్టలేనిదైనా…రాష్ట్ర ప్రభుత్వం తరుపున మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వేల్పూర్ వాసిగా నేను అండగా ఉంటాం. మహేష్ తో పాటు వీరమరణం పొందిన సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్న. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న”. అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.