మందుబాబులకు టీ-సర్కార్ బంపర్ ఆఫర్..!

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో.. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహా.. అన్నింటిపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు లిక్కర్ షాపులు, బార్లను కూడా మూసేశాయని ఆదేశాలిచ్చాయి. అయితే గత మూడు రోజులుగా మద్యానికి బానిసైన కొందరు విచిత్రంగా ప్రవర్తించడమే కాకుండా.. పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇక కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. […]

మందుబాబులకు టీ-సర్కార్ బంపర్ ఆఫర్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 7:16 PM

కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో.. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహా.. అన్నింటిపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు లిక్కర్ షాపులు, బార్లను కూడా మూసేశాయని ఆదేశాలిచ్చాయి. అయితే గత మూడు రోజులుగా మద్యానికి బానిసైన కొందరు విచిత్రంగా ప్రవర్తించడమే కాకుండా.. పలు రాష్ట్రాల్లో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇక కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.. సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో.. లాక్‌డౌన్ సమయంలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి బానిసలుగా మారిన కొందరు వ్యక్తులు మానసికంగా ఆందోళనకు  గురైతు వింతగా ప్రవర్తించడం వంటి విషయాలపై చర్చించారు. సమావేశానంతరం.. మంత్రి పలుసూచనలు చేశారు.

* ఎవరైనా మద్యానికి వ్యసనమైన వ్యక్తులు మరీ ఎక్కువగా ఆందోళనకు గురైతే రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎక్సైజ్     CI,SIలు ఇలాంటి వ్యక్తులను గుర్తించాలి. * వారికి మానసిక వేదనకు గురికాకుండా సరైన అవగాహన కల్పించాలని సూచించారు. * అవసరమైతే వారిని దగ్గర్లో ఉన్న PHC సెంటర్లలో చికిత్స అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. * మద్యానికి బానిసలుగా ఉన్న వ్యక్తుల కుటుంబాలకు కూడా పలు సూచనలు చేశారు. * ఆ వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెట్టి మద్యం నుంచి మనసు మరల్చడానికి ప్రయత్నించాలి. * ఇందుకోసం యోగ వంటి ఆసనాలు, ద్యానం, వ్యాయామం, ఆద్యాత్మిక చింతన వంటివైపు మళ్లించాలి. * కుటుంబ సభ్యులతో ఇతరత్రా ఆటలు చెస్, క్యారమ్స్ వంటి ఆటలు ఆడుతూ..కాబట్టి కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం వారితో గడపాలని సూచించారు.

* ప్రభుత్వం లాక్‌డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయని స్పష్టం చేశారు. అధికారులు కూడా దీనిపై ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.