అందుకే.. ఆ జిల్లాకు కేసీఆర్ 4 మంత్రి పదవులు ఇచ్చారు: కేటీఆర్

Telangana Minister KTR slams Bjp Leaders, అందుకే.. ఆ జిల్లాకు కేసీఆర్ 4 మంత్రి పదవులు ఇచ్చారు: కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా.. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు.. దారితప్పి నాలుగు ఎంపీ సీట్లు గెలిచి తెగ హడావిడి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ నేతలు.. ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. మీ రాజకీయాలు.. తెలంగాణ రాష్ట్రంలో నడవవని చురకలంటించారు. అయినా.. వైఎస్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య లాంటి మహామహులనే చూశామని.. కేసీఆర్ తప్పు చేసి ఉంటే.. వాళ్లు వదిలిపెట్టి ఉండేవాళ్లా..? అంటూ ప్రశ్నించారు. కాగా.. కొద్దిరోజుల నుండి.. కేసీఆర్.. ఎందుకు కరీంనగర్‌కే అన్ని మంత్రి పదవులు కేటాయించారని.. హడావిడి చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా అంటే.. సీఎం కేసీఆర్‌కు ఇష్టం, అందుకే ఆ ఒక్క జిల్లాకే నాలుగు మంత్రి పదవులు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *