మంత్రి కేటీఆర్‌కు ట్వీట్.. రెండు రోజుల్లో మారుమూల పల్లెకి తాగునీరు..

ప్రజల సమస్యల పరిష్కారంలో తానేప్పుడు ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. తాగునీరు లేక అవస్థలు పడుతున్న మారుమూల గ్రామాన్ని ఆదుకోవాలంటూ ఓ యువకుడు చేసిన ట్వీట్ కి వెంటనే స్పందించారు. రెండు రోజుల్లో నీరందించాలని ఆధికారులను ఆదేశించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీటర్ లో స్పందిస్తున్నారని తెలుసుకున్న ఓ యువకుడు తమ గ్రామంలోని నీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. నిర్మల్ జిల్లా తానుర్ మండలం కోలూర్ గ్రామానికి […]

మంత్రి కేటీఆర్‌కు ట్వీట్..  రెండు రోజుల్లో మారుమూల పల్లెకి తాగునీరు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 22, 2020 | 9:40 PM

ప్రజల సమస్యల పరిష్కారంలో తానేప్పుడు ముందుంటానని మరోసారి నిరూపించుకున్నారు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. తాగునీరు లేక అవస్థలు పడుతున్న మారుమూల గ్రామాన్ని ఆదుకోవాలంటూ ఓ యువకుడు చేసిన ట్వీట్ కి వెంటనే స్పందించారు. రెండు రోజుల్లో నీరందించాలని ఆధికారులను ఆదేశించారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీటర్ లో స్పందిస్తున్నారని తెలుసుకున్న ఓ యువకుడు తమ గ్రామంలోని నీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. నిర్మల్ జిల్లా తానుర్ మండలం కోలూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు ట్వీటర్ ద్వారా తెలియజేశాడు. మారుమూల ప్రాంతమైన కోలూర్ ఇప్పటికీ తాగునీటి సమస్యతో బాధపడుతున్నారంటూ వీడియో ద్వారా వివరించాడు. లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికి చుక్క నీరైన అందించలేదని కేటీఆర్ కి ట్వీట్ చేశాడు.

దీంతో వెంటనే స్పందించిన మంత్రి.. జిల్లా యంత్రాంగాన్ని అలర్డ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన జిల్లా అధికారులు.. ఆ గ్రామాన్నీ వెతుకుంటూ చేరుకుని రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీంతో ఆ యువకుడి వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని తెలుసుకున్న గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ యువకుడ్ని అభినందించారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు.