కాలేజీ అమ్మాయిలూ ! మీరు గ్రేట్ ! కేటీఆర్.!. మరి.. వర్మ జై కొట్టిందెవరికి ?

KTR and Ram Gopal Varma Reacts About S.T Francis College Protest, కాలేజీ అమ్మాయిలూ ! మీరు గ్రేట్ ! కేటీఆర్.!. మరి.. వర్మ జై కొట్టిందెవరికి ?

హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల యాజమాన్యం తమ విద్యార్థినులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించిన సంగతి తెలిసిందే. వారు మోకాళ్ళను దాటిన కుర్తీలను విధిగా ధరించాలని అధికారులు ఆదేశించారు. అయితే ఈ నిబంధన నిరంకుశంగా ఉందని అంటూ కాలేజీ విద్యార్థినులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సోమవారం తరగతులను బహిష్కరించి కాలేజీ ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. దీంతో కళాశాల యాజమాన్యం దిగిరాక తప్పలేదు. డ్రెస్ కోడ్ నిబంధనను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ కళాశాల అమ్మాయిలను అభినందించారు. గర్ల్ పవర్ అంటే ఇదేనంటూ.. తమ ప్రాథమిక హక్కుల కోసం గళమెత్తిన విద్యార్థినులు మన సమాజానికి, దేశానికి మంచే చేశారని ఆయన ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చుకున్నారు. ‘ వావ్ ! ప్రగతిశీల ప్రభుత్వం అంటే ఇదే .. జై టీఆరెస్ ‘ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ మధ్య సినిమాల హడావుడి లేని ఈ దర్శకుడు ఇలాంటి ‘ కీలకమైన ‘ అంశాలపై స్పందించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *