అందుబాటులోకి వచ్చిన బైరామల్‌గూడ జంక్షన్

హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్. ట్రాఫిక్ కష్టాలు గట్టేస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎల్‌బీ నగర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్ల్లైఓవర్‌ను సోమవారం పురపాలక శాఖమంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు.

అందుబాటులోకి వచ్చిన  బైరామల్‌గూడ జంక్షన్
Follow us

|

Updated on: Aug 10, 2020 | 1:19 PM

హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్. ట్రాఫిక్ కష్టాలు గట్టేస్తూ మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఎల్‌బీ నగర్ బైరామల్‌గూడ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్ల్లైఓవర్‌ను సోమవారం పురపాలక శాఖమంత్రి కేటీ.రామారావు ప్రారంభించారు. దీంతో గ్రేటర్‌వాసుల ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందనున్నారు. ఈ ఫ్లైఓవర్ ద్వారా సికింద్రాబాద్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మీదుగా బెంగుళూరు, శ్రీశైలం వైపు, అలాగే సాగర్‌రోడ్డు వైపు ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ సమస్యలు తీరనున్నాయి.

ఈ ఫ్లైఓవర్‌ను ఎస్సార్‌డీపీ ఫేజ్‌-1 ప్యాకేజీ-2లో భాగంగా రూ. 26.45 కోట్ల వ్యవయంతో ప్రీకాస్ట్‌ విధానంలో నిర్మాణం చేపట్టినట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే మొదటిసారి 780 మీటర్ల పొడవుతో ప్రత్యేక టెక్నాలజీని ఈ నిర్మాణంలో వినియోగించినట్టు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.