Breaking News
  • జిహెచ్ఎంసి ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన బల్దియా అధికారులు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశం. ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేలోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలి - లోకేష్ కుమార్. ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి - లోకేష్ కుమార్. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి - లోకేష్ కుమార్.
  • ఏరియా ఆస్పత్రి కేసీఆర్ కిట్ లలో గోలమాల్. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో ఘటన పై విచారణ చేపట్టిన వైద్యాధికారులు . డెలివరీల డేటా ఎంట్రీలు చేయకుండా గోల్ మాల్ . ప్రతి కాన్పుకు అబ్బాయికి 11 వేలు అమ్మాయికి 12వేలుతో పాటు కేసీఆర్ కిట్ . బెనిఫిషరీస్ కు రావలసిన మొత్తం లో అవకతవకలను గుర్తించిన డిఎం అండ్ వో కార్యాలయం. 300 డెలివరీ డిటైల్స్ ఎంట్రీ కాకపోవడంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు. డేటా ఎంట్రీలు గోల్ మాల్ పై బాధ్యుడిగా గుర్తించిన డేటా ఎంట్రీ ఆపరేటర్ సతీష్. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదుచేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ . డిఎం అండ్ వో కార్యాలయంలో గుర్తించి ఏరియా ఆసుపత్రిని అప్రమత్తం చేశాం: టీవీ9 తో dm&ho స్వరాజ్యాలక్ష్మి. డెలివరీల డేటాపై సూపరింటెండెంట్ ను ఆదేశించడంతో అసలు విషయం బయట పడింది: dm&ho. పోలీస్ ల విచారణలో మరిన్ని విషయాలు వెల్లడవుతాయి: dm&ho.
  • తిరుపతి: శ్రీకాళహస్తి ఆలయంలోపల కు విగ్రహాలు తీసుకెళ్లిన కేసులో నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన ఎస్పీ రమేష్ రెడ్డి. నిందితులు ముగ్గురూ పుత్తూరుకు చెందినవారు. వ్యక్తిగత సమస్యలు, దోషాలు పోవడానికి విగ్రహాలకు పూజలు చేసి ఆ విగ్రహాలను శ్రీకాలహాస్తి అలయంలోపల ఉంచారు. నందీశ్వరుడు, శివుడి విగ్రహాలను తిరుపతిలోనే ఏడు వేలకు కొనుగోలు చేశారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు పెళ్లి కాకపోవడం, అప్పుల పాలయిపోవడం, ఇతర సమస్యలకు దోషం పోవాలంటే పూజలు చేయాలని ఒక స్వామీజీ చెప్పిన సలహాతో ఇలా చేశారు. పూజలు చేసిన విగ్రహాలను శ్రీకాళహస్తి ఆలయంలో పెడితే దోషాలు పోయి ..కలిసి వస్తుందని స్వామీజీ చెప్పాడు. వీరి చేత పూజలు చేయించి ఇంతటి వివాదానికి కారణమైన స్వామీజీ కోసం గాలిస్తున్నాము.
  • కోటి 12 లక్షల లంచం కేసులో రెండవరోజు నిందితుల కస్టడి. ఐదుగురు నిందితులను రెండవ రోజు విచారించనున్న ఏసీబీ. ఆర్డీవో అరుణా రెడ్డి ని చంచల్ గూడ జైలునుండి ఏసీబీ కార్యాలయానికి తరలించినున్న ఏసీబీ అధికారులు. అడిషనల్ కలెక్టర్ నగేష్ తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పాటు ఏసీబీ అధీనం లోనే నిందితులు. నగేష్ బ్యాంక్ లాకర్ పై నేడు విచారణ. 40 లక్షలు ఎక్కడ అనే దానిపై రాని స్పస్టత . అవినీతి, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రశ్నంచనున్న ఏసీబీ. పలువురు అనుమానితులను, సాక్షులను విచారించనున్న ఏసీబీ.
  • అమరావతి : గన్నవరం నుండి ప్రత్యేక విమానం లో డిల్లీ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్.
  • టివి9 ఎఫెక్ట్.. నోళ్లు తెరుచుకున్న ఓపెన్ డ్రైనేజీ కథనాలపై స్పందించిన జిహెచ్ఎంసీ అధికారులు. మూసాపేట ప్రాంతంలో ప్రమాదకర నాళాలను పరిశీలించిన అధికారులు. ప్రమాదకర నాలాలను పరిశీలిస్తున్నాం..ఇప్పటికి పది కిలోమీటర్లు తనిఖీ చేశాం. ఇప్పటి వరకూ 2కిలోమీటర్ల డేంజర్ డ్రైన్లను గుర్తించాం: టివి9 తో డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఇప్పటికి గుర్తించిన వాటికి ఐదు కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం: డిప్యూటీ కమిషనర్ రవికుమార్. కబీర్ నగర్ లో 260 మీటర్లు కాలువ మరమ్మతులు , ప్రొటక్షన్ పనులకు ప్రపోజల్స్ పెట్టాం: డిప్యూటీ కమిషనర్. కాలువ పరిస్థితిని బట్టి సైడ్ వాల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం: డిప్యూటీ కమిషనర్. ఓపెన్ డ్రైన్ల వద్ద రిటైనింగ్ వాల్ ,సైడ్ వాల్ , ఇతర మరమ్మత్తుల కోసం మరిన్ని ప్రణాళికలు తయారుచేస్తున్నాం: డిప్యూటీ కమిషనర్ రవికుమార్.

ఏపీ సీఎం జగన్‌తో మాకు మంచి సంబంధాలు: కేటీఆర్‌

ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు.
minister ktr session in twitter, ఏపీ సీఎం జగన్‌తో మాకు మంచి సంబంధాలు: కేటీఆర్‌

Minister ktr session in twitter : ఏపీ సీఎం జగన్‌తో తమకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. అయినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమన్నారు. కేసీఆర్‌ తర్వాత తనకు ఇష్టమైన లీడర్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అని చెప్పారు. ఆస్క్‌ మీ పేరుతో ట్విట్టర్‌లో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను ప్రజలు కేటీఆర్‌ దృష్టికి తీసుకురాగా.. ఆయన ఆయా శాఖలను అప్రమత్తం చేశారు.

కరోనా కాలంలో ప్రైవేట్‌ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు. ఇప్పటికే కొన్నింటిపై చర్యలు తీసుకున్నామని, మరికొన్నింటిపై చర్యలు తీసుకుంటామన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించామని వివరించారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి చికిత్స అందిస్తున్నందున ప్రజలు ఆ సేవలను వినియోగించుకోవాలని కేటీఆర్‌ కోరారు. ప్రస్తుతం రోజుకు 23వేల కొవిడ్‌ నిర్ధరణ పరీక్షలను చేస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 40వేలకు పెంచుతామని పేర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ మెరుగైన పథకమని చెప్పారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంతో విలువైన సేవలను అందిస్తున్నారని అభినందించారు. కరోనాకు మొదటి వ్యాక్సిన్‌ తెలంగాణ నుంచే వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు మంత్రి. అన్ని ఏరియా ఆస్పతుల్లో ఐసీయూ యూనిట్స్‌ మొదలుపెట్టామని, ఉచితంగా డయాలసిస్‌ కూడా నిర్వహిస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ఒక్క రాజధానిలోనే 200 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేశామన్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చినా సంతోషమేనన్నారు. ప్రజా రవాణా తిరిగి ప్రారంభించే విషయంలో కేంద్రం అనుమతి కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు. కరోనా పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిక లేదని స్పష్టం చేశారు. స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. టీఎస్‌ బీపాస్‌ పట్టణ సంస్కరణల్లో బెంచ్‌ మార్క్‌గా నిలుస్తుందన్నారు. ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి కావడం గర్వకారణమని చెప్పారు. నేరాల నియంత్రణకు కెమెరాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నెల మూడో వారంలో దుర్గం చెరువు తీగల వంతెన ప్రారంభిస్తామని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: షాకింగ్‌ న్యూస్‌.. కరోనాతో కోలుకున్నా ఆ ముప్పు తప్పదట

Related Tags