బీడీ పరిశ్రమపై జీఎస్టీని తగ్గించండి.. కేంద్ర మంత్రిని కోరిన మంత్రి హరీశ్

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్న బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు. గోవాలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బీడీ కార్మికుల ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు బీడీలు చుట్టడాన్నే జీవనోపాధిగా ఎంచుకున్నారని, వారు అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో వెయ్యి బీడీ తయారీ […]

బీడీ పరిశ్రమపై జీఎస్టీని తగ్గించండి.. కేంద్ర మంత్రిని కోరిన మంత్రి హరీశ్
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2019 | 7:00 PM

తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు ఉపాధి పొందుతున్న బీడీ పరిశ్రమపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు. గోవాలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు బీడీ కార్మికుల ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలు బీడీలు చుట్టడాన్నే జీవనోపాధిగా ఎంచుకున్నారని, వారు అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలో వెయ్యి బీడీ తయారీ యూనిట్లు ఉన్నాయని, వీటన్నిటిలో దాదాపు 5 లక్షల మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని హరీశ్‌రావు వివరించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఆదుకోడానికి ఒక్కొక్కరికీ నెలకు రూ.2016 చొప్పున ఆసరా పెన్షన్ ఇస్తున్నామని, ఈ దశలో కేంద్రం జీఎస్టీని విధించడం, భారీగా పన్నుల పెంచడంతో వీరి జీవితాలు ముందుకు సాగడం లేదని హరీశ్‌రావు తెలిపారు.

ప్రస్తుతం బీడీలపై జీఎస్టీ ప్రస్తుతం 28 శాతం ఉందని, బీడీ ఆకులపై 18 శాతం ఉందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పన్నులు విధించడంతో పరిశ్రమ నష్టాల్లోకి వెళ్లే అవకాశాలున్నాయని, వీటిని ఉపసంహరించాలని హరీశ్‌రావు కోరారు. బీడీ కార్మికుల ఆర్ధిక స్వావలంబన విషయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. వీరి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి హరీశ్‌రావు వెంట రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామక‌ష్ణారావు కూడా హాజరయ్యారు.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..