లిక్కర్ లక్.. ఎవరికి దక్కేనో..?

రాష్ట్రంలో మద్యం షాపులకు యజమానుల ఎంపిక ఇవాళ(శుక్రవారం) జరగనుంది. లక్కీ డ్రా ద్వారా 2,216 షాపులకు యజమానులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. గతేడాది కంటే దరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. లక్కీ డ్రా తీసేందుకు మొత్తం 34 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మొత్తం 2,216 […]

లిక్కర్ లక్.. ఎవరికి దక్కేనో..?
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2019 | 9:01 AM

రాష్ట్రంలో మద్యం షాపులకు యజమానుల ఎంపిక ఇవాళ(శుక్రవారం) జరగనుంది. లక్కీ డ్రా ద్వారా 2,216 షాపులకు యజమానులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయనున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. గతేడాది కంటే దరఖాస్తుల సంఖ్య పెరిగిందన్నారు. ఇక నవంబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పారు. లక్కీ డ్రా తీసేందుకు మొత్తం 34 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. మొత్తం 2,216 దుకాణాలకు 48,401 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వానికి గతేడాది కంటే అదనపు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. డివిజన్లవారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డిలోని 422 మద్యం షాపులకు 8,892 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.177.84 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలకు పెంచినప్పటికీ మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2017లో దరఖాస్తుల ద్వారా రూ.412 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.968.02 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లాలో ఐదు కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన మద్యం షాపులకు డ్రా నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. జిల్లాలో బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు, ఆర్మూర్ పరిధిలో మూడు, నిజామాబాద్ పరిధిలోని రెండు షాపుల డ్రాను నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.