నాలుగు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఆమోదం

తెలంగాణ శాస‌న‌మండ‌లి ఆ నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్ట సవరణ బిల్లుల‌ను మండ‌లిలో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు.

నాలుగు బిల్లుల‌కు శాస‌న‌మండ‌లి ఆమోదం
Follow us

|

Updated on: Oct 14, 2020 | 2:47 PM

తెలంగాణ శాస‌న‌మండ‌లి ఆ నాలుగు బిల్లుల‌కు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్ట సవరణ బిల్లుల‌ను మండ‌లిలో ఆయా శాఖ‌ల మంత్రులు ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం బిల్లులపై చ‌ర్చించి.. స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం ఈ నాలుగు బిల్లుల‌ను ఆమోదిస్తున్న‌ట్లు శాసనమండలి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. అనంత‌రం మండ‌లిని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ఆయన తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స‌వ‌ర‌ణ బిల్లు-2020ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ. రామారావు శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఇండియ‌న్ స్టాంప్ బిల్లు(తెలంగాణ‌)2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు (కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ను శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ను న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్ర‌వేశ‌పెట్టారు. ఈ నాలుగు బిల్లుల‌కు నిన్న శాస‌న‌స‌భ ఆమోదం తెలిపిన ఈ బిల్లులపై ఇవాళ మండలిలో చర్చించారు. అనంతరం నాలుగు బిల్లులకు ఆమోదం తెలుపుతున్నట్లు ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.

మండ‌లిలో ఆమోదం పొందిన బిల్లులుః

1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020ః * భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారు.

2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ః * వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేశారు. * ధరణి ద్వారానే ఆన్​లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించారు. * వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు చేశారు.

3. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020ః * మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ స‌వ‌ర‌ణ చేశారు. * 10 శాతం గ్రీన్ బ‌డ్జెట్‌కు నిధుల కేటాయింపు. * 10 సంవ‌త్స‌రాలకు ఒక‌సారి రిజ‌ర్వేష‌న్ల మార్పున‌కు స‌వ‌ర‌ణ‌. * నాలుగు ర‌కాల వార్డు వాలంటీర్ల క‌మిటీల ఏర్పాటుకు స‌వ‌ర‌ణ‌. * ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వాన్ని ఎస్ఈసీని సంప్ర‌దించాల‌ని చ‌ట్ట స‌వ‌ర‌ణ‌.

4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ః * హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించారు.

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..