రాజముద్రలో ఇది తప్పనిసరి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలు “భారతదేశ రాజముద్ర”ని తప్పని సరి చేసింది. రాజముద్రలో తప్పనిసరిగా ‘సత్యమేవ జయతే’ని వాడాలని తెలిపింది. అదికూడా దేవనాగరి లిపిలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. రాజముద్రను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అధికారం ప్రభుత్వ సంస్థలకు ఉన్నదని, దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే నినాదంతో కూడిన రాష్ట్ర చిహ్నాన్ని చిత్రీకరించాలని […]

రాజముద్రలో ఇది తప్పనిసరి..
Follow us

|

Updated on: Jun 26, 2020 | 8:51 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలు “భారతదేశ రాజముద్ర”ని తప్పని సరి చేసింది. రాజముద్రలో తప్పనిసరిగా ‘సత్యమేవ జయతే’ని వాడాలని తెలిపింది. అదికూడా దేవనాగరి లిపిలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. రాజముద్రను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అధికారం ప్రభుత్వ సంస్థలకు ఉన్నదని, దేవనాగరి లిపిలో ‘సత్యమేవ జయతే’ అనే నినాదంతో కూడిన రాష్ట్ర చిహ్నాన్ని చిత్రీకరించాలని సూచించింది.

‘సత్యమేవ జయతే’ లేకుండా రాజముద్రను వినియోగించినవారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఆ పూర్తి వివరాలను భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌ http://www.mha.gov.in లో అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేసింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు.