Breaking News
  • దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభన గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24, 879 పాజిటివ్ కేసులు నమోదు కాగా 487 మంది మృతి. దేశంలో కరోన బాధితుల సంఖ్య 7, 67, 296 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 2, 69, 789 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 4, 76, 378 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 21, 129 మంది మృతి.
  • మూడో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు.. దారులన్నీ మూసివేత. నాలుగు బ్లాకులతో పాటు పాత భవనాలు నేలమట్టం. సమాంతరంగా ఇతర బ్లాకుల్లో కూల్చివేత పనులు. మరో మూడు రోజుల్లో కూల్చివేత పనులు పూర్తి. 15రోజుల పాటు అర్ధరాత్రి వేళ శిధిలాల తరలింపు. వారం పాటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.
  • యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అరెస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో అరెస్ట్. కొద్ది రోజుల క్రితం డీఎస్పీ సహా 8 మంది పోలీసులను కాల్చి చంపిన వికాస్ దూబే గ్యాంగ్. వికాస్ దూబే కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి గాలింపు. వరుసగా అనుచరుల ఎన్‌కౌంటర్, తాజాగా వికాస్ అరెస్ట్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్ నడపండి. నిన్న గోపాల్‌పురంలో ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ జారిపడి తలకు గాయమైంది.. తరువాత ఆసుపత్రిలో మరణించాడు. బహుశా అతను హెల్మెట్ ధరించి ఉంటే బ్రతికి ఉండేవాడు.. హెల్మెట్ మీ భద్రత కోసం.. పోలీసుల తనిఖీ కోసం కాదు. బైక్ పై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయండి.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

Telangana Inter Board: ఆ 79 కాలేజీలకు ఇంటర్ బోర్డు నోటీసులు.. స్పందించకపోతే మూసివేత.?

రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝుళిపించింది. తాజాగా ఆయా కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేదంటే మూసివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Inter Board, Telangana Inter Board: ఆ 79 కాలేజీలకు ఇంటర్ బోర్డు నోటీసులు.. స్పందించకపోతే మూసివేత.?

Telangana Inter Board: రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లేని జూనియర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝుళిపించింది. తాజాగా ఆయా కళాశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వాటికి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేదంటే మూసివేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. అనుబంధ గుర్తింపు, అనుమతులకు విరుద్ధంగా తరలించి నడుపుతున్న వాటిపై ఈ నెల 25లోగా చర్యలు తీసుకుని తమకు నివేదికను సమర్పించాలని ఇటీవల ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సుమారు  79 కాలేజీలకు బోర్డు నోటీసులు పంపారు.

Also Read:  UP Sonbhadra No Discovery Of Gold Mines

ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలు మేరకు కళాశాలలకు నోటీసులు జారీ చేశాం. వాటికి స్పందించి సకాలంలో వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాలను ఆయన కోరారు. త్వరలో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమకు అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ఉన్నత విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు. కొన్ని కలీజులు ఒక చోటు అనుమతులు తీసుకుని వేరొక చోటు నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా కోర్టుకు నివేదిక ఇవ్వాల్సిన గడువు దగ్గర పడుతుండటంతో యాజమాన్యాలు వెంటనే సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Also Read: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలు..

Related Tags