Breaking News
  • ముంపు ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది- మంత్రి కె.తారక రామారావు: ప్రభుత్వం అందిస్తున్న పదివేల తక్షణ అర్ధిక సహాయన్ని పలు కాలనీల్లోని ప్రజలకు అందించిన కెటియార్. పలు కాలనీల్లో పర్యటించి పలు కుటుంబాల యోగక్షేమాలు కనుక్కోని, వారికి అర్ధిక సహాయం అదించిన కెటియార్. వరద భాదితులు ఏంత మంది ఉంటే అంత మందకి సహాయం అందిస్తాం. హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆర్థిక సాయం అందజేస్తుందన్న మంత్రి.
  • చెన్నై: మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి తమిళనటుడు విజయ్‌ సేతుపతి. అయినా సోషల్‌ మీడియా వేదికగా ఆగని బెదిరింపులు. విజయ్‌ కుమార్తెపై దాడి చేస్తామంటూ ట్రోల్‌ చేస్తున్న ఆకతాయిలు . తీవ్రంగా ఖండించిన డీఎంకే ఎంపీ కనిమొళి . స్ట్రీలపట్ల, చిన్న పిల్లలపై సోషల్‌ మీడియాలో.. ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. కారణమైన వారిపై కేసు నమోదు చేసి శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి .
  • తాడేపల్లి: పలు కీలక అంశాలపై సీఎం జగన్‌ సమీక్ష . భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై సీఎం సమీక్ష . జిల్లా కలెక్టర్లు, ఎస్సీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ . స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై చర్చ . గ్రామ సచివాలయాలు, విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్స్‌ నిర్మాణంపై సమీక్ష . రేపు ప్రారంభించనున్న వైఎస్సార్‌ బీమాతో పాటు పలు పథకాలపై చర్చ . ఉచిత విద్యుత్‌, రైతు అకౌంట్‌లో నగదు అంశంపై చర్చ .
  • టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి . హైదరాబాద్‌: తహశీల్దార్‌ నాగరాజుది ఆత్మహత్యలాగానే అనిపిస్తోంది . పిరికివాళ్లు ఎప్పుడూ సూసైడ్‌ చేసుకోరు . ధైర్యవంతులే సూసైడ్‌ చేసుకుంటారు. జైల్లో ఇంటరాగేషన్‌ జరగదు కాబట్టి మానసిక ఒత్తిడితోనే.. నాగరాజు సూసైడ్‌ చేసుకునే అవకాశం ఉంది . జైల్లోకానీ, బయటగానీ ఉ.3-4 గంటల మధ్యే సూసైడ్‌ చేసుకుంటారు . నాగరాజుది పార్షల్‌ హ్యాంగింగ్‌గానే అనే అనిపిస్తోంది . సింథటిక్‌ కాటన్‌ బట్టతో ఉరేసుకుంటే ఎలాంటి మరకలు కన్పించవు . తాడుతో ఉరేసుకుంటే మరకలు కన్పిస్తాయి-నారాయణరెడ్డి . 7 ఫీట్లున్న కిటికీ గ్రిల్‌కి టవల్‌తో ఉరేసుకుంటే ఎలాంటి శబ్ధం రాదు. నాగారాజు సూసైడ్‌ చేసుకునే సమయంలో.. కాళ్లు నేలకు ఆనుకుని ఉండడం వల్లే ఎలాంటి గాయాలు కాలేదు . 3 నుంచి 4 నిమిషాల వ్యవధిలోనే నాగరాజు చనిపోయి ఉంటాడు . ఆ సమయంలో మిగతా ఖైదీలు గాఢనిద్రలో ఉండడంవల్లే గుర్తించలేదు. - టీవీ9తో ఫోరెన్సిక్‌ ఎక్స్‌పర్ట్‌ నారాయణరెడ్డి .
  • విశాఖ: నడువూరు చైన్‌ స్నాచింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు . సీసీ కెమెరాల్లో లభించని నిందితుడి ఆచూకీ . పాన్‌షాపులో ఉన్న మహిళపై కత్తితో దాడి చేసి చైన్‌ను ఎత్తుకెళ్లిన దుండగుడు . టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిందితుడిని ట్రాక్‌చేసే పనిలో పోలీసులు . ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలు .

ఇంటర్‌‌లో 30 శాతం సిలబస్ తగ్గించారు…

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది...

Inter Syllabus, ఇంటర్‌‌లో 30 శాతం సిలబస్ తగ్గించారు…

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ తగ్గిస్తున్నట్లుగా ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్‌ను తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఈయర్‌లో 30 శాతం సిలబస్ తగ్గించింది.

సీబీఎస్‌ఈ (CBSE)సూచనల ప్రకారం ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ తెలుగు సబ్జెక్ట్‌లో 30 శాతం సెలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. మరోవైపు ఇంటర్ సెకండ్ ఈయర్‌లో హిస్టరీ, ఏకనామిక్స్, పొలిటికల్ సైన్స్ (సివిక్స్), జియోగ్రఫ్రీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీలో  సిలబస్‌ను ఇంటర్ బోర్డు తగ్గించింది. అయితే తగ్గించిన సిలబస్ 2020-21 సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని, తగ్గించిన సెలబస్‌ను ఇంటర్ వెబ్ సైట్‌లో చూడవచ్చని ఇంటర్ బోర్డు అధికారులు  వెల్లడించారు.

కాగా కరోనాను నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా, దేశ వ్యాప్తంగా నాలుగు నెలల తరగతులు నిర్వహించలేకపోయారు. అయితే ఆలస్యం కావడం వల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం (CBSE) ఈ విద్యా సంవత్సరాన్ని జీరో ఇయర్ ‌(సంవత్సరం పాటు క్లాసులు నిర్వహించకపోవడం) నుంచి కాపాడటానికి కొన్ని సూచనలు చేసింది. తగ్గించిన సిలబస్ వివరాలను టీఎస్‌బీఐఈ (TSBIE) అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.in లో సందర్శించవచ్చని ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు.

Related Tags