హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు…

రిమాండ్ లో ఉన్న రేవంత్ కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. మిగిలిన..

హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురు...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 13, 2020 | 2:59 PM

కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై డ్రోన్ కెమెరా వినియోగించిన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మరోమారు హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోరుతూ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు మంగళవారానికి విచారణ వాయిదా వేసింది.

డ్రోన్ కెమెరా వినియోగించారన్న కేసులో అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్ రెడ్డి మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని, మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని, పార్లమెంటు సమావేశాలు ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, ప్రస్తుతం ఈ కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రేవంత్‌ రెడ్డికి.. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటిషన్ కొట్టివేత నేపథ్యంలో మరోసారి ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే రేవంత్ అంశంపై అటు పార్లమెంట్‌లోనూ తీవ్ర దుమారం లేపింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఫార్మ్‌ హౌస్‌పై రేవంత్‌రెడ్డి డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేయడంపై లోక్‌సభలో రభస జరిగింది. మంత్రి కేటీఆర్‌ ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని..ఎంపీ రేవంత్‌రెడ్డిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారంటూ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ. ఎంపీ ప్రశ్నకు ధీటుగా సమాధానమిచ్చారు టీఆర్‌ఎంపీ నామా నాగేశ్వరరావు. ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం ప్రకారం డ్రోన్‌ కెమెరాతో షూట్‌ చేయడం చట్ట విరుద్ధమని సమాధానమిచ్చారు.