తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. బీఆర్ఎస్‌లపై స్టే యధావిధిగా కొనసాగింపు…

Telangana High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్‌లపై స్టేను యధావిధిగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది....

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. బీఆర్ఎస్‌లపై స్టే యధావిధిగా కొనసాగింపు...
Telangana High Court
Follow us

|

Updated on: Jan 20, 2021 | 1:45 PM

Telangana High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్‌లపై స్టేను యధావిధిగా కొనసాగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. సుప్రీం కోర్టు తుది ఆదేశాలు ఇచ్చిన తర్వాతే ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని.. అప్పటివరకూ బీఆర్ఎస్‌పై స్టే యధావిధిగా కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని.. ఎల్ఆర్ఎస్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను సైతం సమర్పించాలని సూచించింది.

ఎల్ఆర్ఎస్ మీద రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని ఏజీ కోర్టుకు తెలపగా.. ఆయన చెప్పిన స్టేట్మెంట్‌ను సైతం కోర్టు నమోదు చేసుకుంది. కాగా, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్‌లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను ఇంప్లీడ్‌ చేసిన సుప్రీంకోర్టు.. వాటిపై విధివిధానాలను తెలపాలంటూ ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.