Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

టీఎస్ పోలీసుల నోటీసులకు అశోక్ వివరణ ఇవ్వాలి- హైకోర్ట్

, టీఎస్ పోలీసుల నోటీసులకు అశోక్ వివరణ ఇవ్వాలి- హైకోర్ట్

హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రాజకీయ కుట్ర, దురుద్దేశాల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని అశోక్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు డేటా చౌర్యం కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది.

Related Tags