కార్మికుల‌కు నెల‌కు రూ. 1500 ?.. తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క‌ నిర్ణ‌యం !

కార్మికుల దుర్భ‌ర ప‌రిస్థితిని గ‌మ‌నించే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.............

కార్మికుల‌కు నెల‌కు రూ. 1500 ?.. తెలంగాణ స‌ర్కార్ మ‌రో కీల‌క‌ నిర్ణ‌యం !
Follow us

|

Updated on: Apr 29, 2020 | 9:43 AM

క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా కోట్లాది జీవితాలు త‌ల‌కిందుల‌య్యాయి. భార‌త్‌లోనూ వేగంగా విస్త‌రిస్తున్న వైర‌స్ అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను స్తంభింప‌జేసింది. దీంతో చిన్న ఉద్యోగులు, రెక్కాడితే గానీ, డొక్కాడ‌ని రోజు కూలీలు ఉపాధి కోల్పోయారు. మ‌రీ ముఖ్యంగా భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. వీరంతా రోజు కూలీలుగానే ప‌నిచేస్తుంటారు. పని చేసిన‌రోజే కూలీ.. లేదంటే కొద్దోగొప్పో కూడ‌బెట్టుకున్న‌దాంట్లోంచే ఆ రోజుకు ఖ‌ర్చుపెట్టుకోవాలి. రోజుల త‌ర‌బ‌డి ప‌నిదొర‌క‌ని ప‌రిస్థితి ఏర్ప‌డితే మాత్రం వీరు కుటుంబాల‌తోస‌హా ప‌స్తులుండ‌టం త‌ప్ప వేరే దారి ఉండ‌దు. వీరి దుర్భ‌ర ప‌రిస్థితిని గ‌మ‌నించే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి కోల్పోయిన భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు నెల‌కు రూ. 1500 చొప్పున మూడు నెల‌ల పాటు సాయం అందించాల‌ని భావిస్తోంది.  పేద‌ల‌కు ఇచ్చే బియ్యం, న‌గ‌దు సాయానికి ఇది అద‌నం కాగా..ఏప్రిల్ నుంచే ఈ సాయం అందించాల‌ని ఆలోచిస్తున్న ప్ర‌భుత్వం..ఇందుకోసం భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నిధుల‌ను వాడుకోనుంది. మార్చి 24న దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన తర్వాత దేశంలోని భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర కార్మిక శాఖ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. ప్ర‌భుత్వాలు వ‌సూలు చేసే కార్మిక సంక్షేమ సెస్ సొమ్మును డీబీటీ ద్వారా కార్మికుల అకౌంట్ల‌లో వేయాల‌ని అన్ని రాష్ట్రాల‌కు సూచించింది. ఈ మేర‌కు రాష్ట్రంలో 15.40 ల‌క్ష‌ల మంది గుర్తింపు పొందిన భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం