కోవిడ్ ఆస్పత్రులుగా మెడికల్ కాలేజీలు!

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకూ వెయ్యికి చేరువుగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా మేడ్చ‌ల్, రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలోనే క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో..

కోవిడ్ ఆస్పత్రులుగా మెడికల్ కాలేజీలు!
Follow us

|

Updated on: Jun 30, 2020 | 7:21 PM

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకూ వెయ్యికి చేరువుగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్ స‌హా మేడ్చ‌ల్, రంగారెడ్డి జిల్లాల ప‌రిధిలోనే క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడిక‌ల్ కాలేజీల్లో క‌రోనా చికిత్స అందించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. మెడిక‌ల్ కాలేజీల్లో ఉండే ల్యాబుల్లో క‌రోనా టెస్టుల‌కు ఐసీఎంఆర్ ఇటీవ‌లే అనుమ‌తిచ్చిన నేప‌థ్యంలో… చికిత్స కూడా అక్క‌డే అందించ‌బోతున్నారు. ఈ మేర‌కు ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఈటెల రాజేంద‌ర్ అధికారుల‌ను ఆదేశించినట్లు సమాచారం.

ఇక తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 15,394 కు చేరగా, కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 253కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 9,559 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక జిల్లాల వారీగా చూస్తే గ్రేటర్‌ హైదరాబాద్‌లో సోమవారం అత్యధికంగా 861 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 11, 813 చేరింది. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్‌లో 10,నల్గొండలో 2, భద్రాద్రిలో 8, సిద్దిపేటలో 1, వరంగల్‌ అర్బన్‌లో 4, వరంగల్ రూరల్ లో 5, మహబూబాబాద్ లో 1, మహబూబ్‌నగర్‌లో 3, అసిఫాబాద్ 1, గద్వాలలో 1, కామారెడ్డిలో 2, యాదాద్రి 2 కేసులు నమోదయ్యాయి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..