అల్లాటప్పాకాదంటోన్న తమిళిసై

కరోనాకి కులంలేదు.. మతంలేదు.. లింగవయసు బేధం లేదు. ఎవ్వరినైనా కాటేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేం యువత...

అల్లాటప్పాకాదంటోన్న తమిళిసై
Follow us

|

Updated on: Aug 30, 2020 | 8:31 PM

కరోనాకి కులంలేదు.. మతంలేదు.. లింగవయసు బేధం లేదు. ఎవ్వరినైనా కాటేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేం యువత… కరోనా మాకెందుకు వస్తుందిలే అనుకోవద్దు… కరోనా ఎవరికైనా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి అని ఉద్భోదించారు. ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను తప్పక పాటించాలని.. కరోనా సోకగానే వీలైనంత తొందరగా వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్లు కూడా కరోనా బారినపడుతున్నారని చెప్పారు. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లోనూ, పురుషుల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల శాతంలో పెరుగుదల కనిపిస్తోందని తమిళిసై వెల్లడించారు. ఇటీవల కాలంలో యువత కరోనా భారిన అధికంగా పడ్డమేకాదు.. కరోనా కారకాలుగా కూడా మారారని నివేదికలు చెబుతోన్న నేపథ్యంలో తమిళిసై వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.