Breaking News
  • కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమబోధన జనసేన విధానం. 8వ తరగతి వరకు మాతృభాష బోధన కేంద్రం విధానం. వైసీపీ సర్కార్‌ కేంద్ర విధానానికి వ్యతిరేకంగా వెళ్తోంది ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలి -పవన్‌ కల్యాణ్‌
  • లక్ష్మీపార్వతికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు. ఏపీ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా లక్ష్మీపార్వతి నియామకం. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న లక్ష్మీపార్వతి
  • కర్నూలు: పాణ్యం విజయానికేతన్‌ స్కూల్‌లో దారుణం. సాంబార్‌ పాత్రలోపడి ఎల్‌కేజీ విద్యార్థికి తీవ్రగాయాలు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి పురుషోత్తంరెడ్డి మృతి
  • కేబినెట్‌ అనంతరం మంత్రులతో సీఎం జగన్‌ భేటీ. ఔట్‌ సోర్సింగ్ కార్పొరేషన్‌పై చర్చ. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించొద్దన్న మంత్రులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పిస్తూనే 50 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం. ప్రభుత్వంపై అవినీతి ముద్ర పడడానికి వీల్లేదన్న సీఎం రాష్ట్రంలో రాజకీయ అవినీతి తగ్గినా అధికారుల స్థాయిలో అవినీతి తగ్గలేదన్న పలువురు మంత్రులు
  • అయోధ్య ట్రస్ట్‌ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
  • తూ.గో: గోదావరిలో ఇసుక పడవ మునక. ఇసుక తరలిస్తుండగా మునిగిన పడవ. కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి దగ్గర ఘటన. సురక్షితంగా బయటపడ్డ ఇసుక కార్మికులు
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టు మృతి. ఓ ఆయుధం, పేలుడు పదార్ధాలు స్వాధీనం సుకుమా జిల్లా గచ్చనపల్లి అటవీ ప్రాంతంలో ఘటన

రాజ్‌భవన్‌ లో బతుకమ్మ సంబరాలు!

రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై బతుకమ్మ వేడుకల్లో పాల్గొని.. తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలుగులో తెలంగాణలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభా కాంక్షలు తెలిపారు. మహిళలు బంగారం, దుస్తులతోపాటుపూలను బాగా ఇష్టపడతారని, శరత్‌రుతువు ఆగమనాన్ని తెలియజేసే చక్కని పూల పండగ బతుకమ్మ అని ఆమె వివరించారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు గౌరమ్మ ఉయ్యాలో…అంటూ మహిళలు ఎంతో ఉత్సాహంలో పాటలుపాడి భక్తితో బతుకమ్మ ఆడారు. ఈకార్యక్రమంలో సాహితీ అభిమానులు, రచయిత్రులు ఐనంపూడి శ్రీలక్ష్మి, ఆవుల మంజులత, దీపికారెడ్డి ఆమె శిష్యబృందంతో కలిపి దాదాపు రెండువందల మందికి పైగా మహిళలు ఈ ఉత్సవాల్లోపొల్గొన్నారు. రాజ్‌భవన్‌ ప్రాంగణంలో అక్టోబరు 5వ తేదీ వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5గంటల నుంచి 6గంటల వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్టు గవర్నర్‌కార్యదర్శి సురేంద్ర మోహన్‌ తెలిపారు. ముఖ్యంగా అక్టోబరు 1న మహిళా జర్నలిస్టులు, న్యాయవాదులు, అక్టోబరు 4న విద్యార్ధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే అక్టోబరు 5న రాజ్‌భవన్‌ మహిళా ఉద్యోగులు, రాజ్‌భవన్‌ పరివారం పాల్గొంటారని అన్నారు.

Picture

30/09/2019,11:01PM