Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

సిరిపురం దాన కర్ణుడు..ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు..!

Telangana Old Man Donates Huge Amount to Armed Forces Flug Day Fund, సిరిపురం దాన కర్ణుడు..ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు..!
ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు..ఎంత ధానం చేశామన్నది ముఖ్యం..దాన గుణం ఉండాలే గానీ, దానికి ధనిక, పేద అనే తేడా ఉండదని నిరూపించాడు చిరు వ్యాపారి సిరిపురం విశ్వనాథం.  సూర్యాపేట జిల్లాకు చెందిన విశ్వానాథం వయస్సు 78 ఏళ్లు.  అతడికి మొదటి నుంచి జీవనాధారం చిన్న కిరణా షాపే… అందులో వచ్చిన ఆదాయాన్ని పైసా పైసా కూడపెట్టాడు.. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో చివరి జీవితాన్ని గడుపుతున్నాడు.. అయినప్పటికీ ఇప్పటి వరకూ సంపాదించినదంతా సైనిక దళాలకు విరాళమిచ్చి దాన కర్ణుడు అనిపించుకున్నాడు.
జిల్లాలోని మట్టపల్లికి చెందిన సిరిపురం విశ్వనాథం గుప్తా చిరు వ్యాపారి..ఆయన సంపన్నుడేం కాదు. కష్టపడితేనే కడుపు నిండుతుంది. కానీ సమాజ శ్రేయస్సును కోరుకున్నాడు.. జీవితమంతా గడిపింది చిరు వ్యాపారిగానే అయినప్పటికీ.. గుణంలో మాత్రం భారీ ఉదారతను చాటుకున్నారు..దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దులలో ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల కోసం తన వ్యాపారంలో వచ్చిన లాభాలను, తన జీవిత కాలంలో కూడబెట్టిన మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.  చివరి అంకంలో కూడా  కష్టపడి సంపాదించిన రూ.50 లక్షలను భారత సైన్యానికి (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ కి) విరాళంగా ఇచ్చి తన దేశభక్తిని చాటుకున్నారు. తెలంగాణ  రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి తన కష్టార్జితం నుండి రూ.50 లక్షలను సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి అందించాలని కోరుతూ చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా గవర్నర్ అతడిని అభినందించారు.. శాలువా కప్పి సత్కరించారు…అతడి దాన శీతలను మెచ్చుకున్నారు.
Telangana Old Man Donates Huge Amount to Armed Forces Flug Day Fund, సిరిపురం దాన కర్ణుడు..ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు..!