ఎల్ఆర్ఎస్‌ చేసుకోండి ఇలా…

అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (LRS‌) ప్రక్రియ ప్రారంభించినట్టు జీవో నెంబరు 131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్‌లోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు సర్కార్‌..

ఎల్ఆర్ఎస్‌ చేసుకోండి ఇలా...
Follow us

|

Updated on: Sep 02, 2020 | 7:05 AM

LRS across state : అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ (LRS‌) ప్రక్రియ ప్రారంభించినట్టు జీవో నెంబరు 131ని విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం అక్రమ లే అవుట్‌లోని ప్లాట్ల అక్రమ నిర్మాణాలకు సర్కార్‌ రిజిస్ట్రేషన్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే.

లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం సౌకర్యం కల్పించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఊరట లభించినట్లెయింది. 26 ఆగస్టు 2020లోపు చేసిన లే అవుట్‌ ఓనర్లకు, రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్లాట్‌ ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మున్సిపల్‌శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ కింది మార్గదర్శకాలకు లోబడే లే అవుట్లకు రెగ్యులర్‌ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. అక్టోబరు 15వ తేదీ వరకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని వెల్లడించారు.

ముఖ్యమైన వివరాలు…

  • ఆగస్టు 25వ తేదీ వరకు కటాఫ్‌ తేదీ 
  • టీఎస్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపు 
  •  అక్టోబరు 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ (LRS)‌ అప్లికేషన్‌ నింపాలి 
  • ఎల్‌ఆర్‌ఎస్‌ (LRS)‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ. 1000 (వ్యక్తిగత ప్లాట్‌ ఓనర్స్‌),
  • లే అవుట్‌ ఓనర్స్‌ అప్లికేషన్‌ ఫీజు రూ. 10వేలు రెగ్యులరైజేషన్‌ చార్జీలు
  • 100 గజాల లోపు ప్లాట్లకు గజానికి రూ. 200   
  • 101 నుంచి 300 గజాల ఫ్లాట్‌కు గజానికి రూ.400లు 
  • 301 నుంచి 500 గజాలుఉన్న  గజానికి రూ. 600లు
  • 501 నుంచి 750 గజాలు ఉన్న వారంతా రూ. 750లు చెల్లించాలి
  • స్లమ్స్‌లో ఉన్న వారు 5శాతం చెల్లించాలి 

రాష్ట్ర సర్కారుకు కోట్లలో ఆదాయం

తెలంగాణ  సర్కార్‌కు కాసుల పంట పండనుంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పథకం భారీగా ఆదాయం తెచ్చిపెట్టనుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి చేయడం, గ్రామ పంచాయతీల్లోనూ ఈ పథకాన్ని వర్తింపజేస్తుండటంతో సర్కారుకు రూ. 10 వేల కోట్ల రాబడి రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరణ రుసుం పెంపు, ప్రస్తుత మార్కెట్‌ విలువనే పరిగణనలోకి తీసుకుంటుండటం, ప్రతి అనధికార ప్లాటు దాదాపుగా ఎల్‌ఆర్‌ఎస్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరనుంది. మరోసారి రియల్ వ్యాపారం పుంజుకోనుంది.