రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా శంకర్ చేతిలో భారీ స్టూడియో..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయాన్ని.. అప్పుడు జరిగిన ఉద్యమాలను ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఆ తరుణాన్ని టాలీవుడ్ పెద్దలైతే అంత తేలికగా మర్చిపోలేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రెండుగా విడిపోతుందని.. ఒకటి హైదరాబాద్ లో.. మరొకటి స్టీల్ సిటీ వైజాగ్ కేంద్రంగా తరలిపోతుందని  వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ మహానగరం కాబట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీ కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇండస్ట్రీ పెద్దలకు హామీ ఇచ్చారు. […]

రామోజీ ఫిలిం సిటీకి ధీటుగా శంకర్ చేతిలో భారీ స్టూడియో..?
Follow us

|

Updated on: Jun 19, 2019 | 6:56 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమయాన్ని.. అప్పుడు జరిగిన ఉద్యమాలను ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ఆ తరుణాన్ని టాలీవుడ్ పెద్దలైతే అంత తేలికగా మర్చిపోలేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ రెండుగా విడిపోతుందని.. ఒకటి హైదరాబాద్ లో.. మరొకటి స్టీల్ సిటీ వైజాగ్ కేంద్రంగా తరలిపోతుందని  వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ మహానగరం కాబట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీ కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఇండస్ట్రీ పెద్దలకు హామీ ఇచ్చారు. దానితో వైజాగ్‌కు టాలీవుడ్ ఇండస్ట్రీ తరలిపోతుందంటూ వస్తున్న వార్తలు అవాస్తవంగానే మిగిలిపోయాయి.

అయితే ఆ ఉద్యమ సమయంలోనే తెలంగాణ సంస్కృతి, భాష, యాస అన్ని కూడా అభివృద్ధి చెందాలని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కేసీఆర్‌ను కోరారు.. కేసీఆర్ కూడా ఆ ప్రతిపాదనపై సుముఖత వ్యక్తం చేసి.. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనితో విజయవాడ, తిరుపతి, వైజాగ్ వంటి నగరాల్లో ఆడియో, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ మాత్రమే జరిగాయి తప్ప.. పూర్తి సినిమా ఇండస్ట్రీ మాత్రం హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ‘జై బోలో తెలంగాణ’ ఫేమ్ దర్శకుడు ఎన్ శంకర్.. హైదరాబాద్‌లో అత్యాధునిక స్టూడియో కట్టడం కోసం స్థలం కేటాయించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాడు. దీనికి అనుగుణంగా సీఎం కేసీఆర్ శంకరపల్లి దగ్గర మోకిలా ప్రాంతంలోని ఐదెకరాల్లో స్టూడియో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో కూడా వేరొక స్టూడియోకి కూడా ప్రభుత్వం స్థలం కేటాయించిందంటూ వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో దర్శకుడు ఎన్. శంకర్ బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం ఇది ఆయనకు కానుకగా ఇచ్చిందని సన్నిహితుల సమాచారం. ఇది చూస్తుంటే తెలంగాణ వారికి చెందిన తొలి స్టూడియో ఇదే అవుతుందని చెప్పవచ్చు. కాగా రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్, రామకృష్ణ స్టూడియోస్, శబ్ధాలయా స్టూడియోస్, పద్మాలయా స్టూడియోస్ హైదరాబాద్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయని తెలిసినదే.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..