రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోరలు చాస్తోన్న కోవిడ్ భయానికి ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వైరస్ భయానికి పనులకు వెళ్లాలన్న భయపడిపోతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Jul 04, 2020 | 5:20 PM

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కోరలు చాస్తోన్న కోవిడ్ భయానికి ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా మంది వైరస్ భయానికి పనులకు వెళ్లాలన్న భయపడిపోతున్నారు. ఇటువంటి సమయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త చెప్పింది. కేంద్రం ఇచ్చే బియ్యానికి అద‌నంగా మ‌రో ఐదు కిలోలు క‌లిపి మొత్తం ఒక్కొక్క‌రికి 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్..

శ‌నివారం కరీంనగర్ లోని క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కొక్కరికి నవంబర్ వరకు 5 కిలోలు ఉచిత బియ్యం ఇస్తామని ప్రకటించిందని, కేంద్రం వాటాకు మరో 5 కిలోలు కలిపి ఈనెల నుంచి నవంబరు వరకు మనిషికి 10 కిలోల బియ్యం పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 87 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని.. ఉచిత బియ్యం పంపిణీతో రాష్ట్రంలో రెండు కోట్ల 79 లక్షల మంది పేదలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు.

కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పేదలకు అండగా ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగానే వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చారు. దేశ‌వ్యాప్తంగా రేష‌న్‌కార్డులు ఉన్న‌వారికి నెల‌కు ఐదు కిలోల గోదుమ‌లు లేదా ఐదు కిలోల బియ్యం చొప్పున‌ ఈ ఏడాది న‌వంబ‌ర్ వ‌ర‌కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..