మందుబాబులకు షాక్.. ఆ టైం దాటితే నో లిక్కర్..

మద్యం పాలసీలో ఏపీ బాటలోనే తెలంగాణ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు నూతన మద్యం విధానం అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలకు లాటరీ పద్దతిలో దుకాణాదారుల ఎంపిక చేయనున్నారు. అయితే ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 శ్లాబులను 6కి చేర్చారు. దరఖాస్తు ఫీజును […]

మందుబాబులకు షాక్.. ఆ టైం దాటితే నో లిక్కర్..
Follow us

| Edited By:

Updated on: Oct 03, 2019 | 5:14 PM

మద్యం పాలసీలో ఏపీ బాటలోనే తెలంగాణ పయనిస్తోంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు నూతన మద్యం విధానం అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలకు లాటరీ పద్దతిలో దుకాణాదారుల ఎంపిక చేయనున్నారు. అయితే ఈ సారి జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. గతంలో ఉన్న 4 శ్లాబులను 6కి చేర్చారు. దరఖాస్తు ఫీజును లక్ష రూపాయల నుంచి రూ.2 లక్షలకు పెంచింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇతర ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఈనెల చివరిలోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్సుదారులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

ఐదు వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 50 లక్షల లైసెన్స్ ఫీజు, 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 55 లక్షలు ఉంటుంది. 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ. 60 లక్షలు, లక్ష జనాభా నుంచి 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ ఫీజు రూ. 65 లక్షలు కట్టాల్సి ఉంటుంది. 5 లక్షల నుంచి 20 లక్షల లోపు జనాభా ప్రాంతాలకు రూ. 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లుగా లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. వాస్తవానికి సెప్టెంబర్ చివరితో మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగియాల్సి ఉంది. అక్టోబరు 1 నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రావాల్సింది. కానీ పాత లైసెన్స్‌ల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??