“టీవీ9 ఖబర్దార్” కథనాలకు స్పందించిన ఆరోగ్య మంత్రి ఈటల

Telangana government reacts to tv9 khabardar team as it exposes in adequate equipment, “టీవీ9 ఖబర్దార్” కథనాలకు స్పందించిన ఆరోగ్య మంత్రి ఈటల

సామాన్యులకు వైద్యసేవలందించినా సర్కార్ దవాఖానాలకు ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు ఖర్చుపెడుతున్నా ..వైద్యసేవలు మాత్రం అంతంతమాత్రంగానే అందుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. అయితే ఏరియా హాస్పిటల్స్‌లో వైద్య పరికరాల కొరతతో వైద్య సదుపాయం అటకెక్కిన పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా గూడూరు కమ్యూనిటీ హాస్పిటల్‌లో వైద్యపరికరాలు లేవనే సాకుతో పక్కదారి పడుతున్న వైద్యంపై టీవీ9 ఖబర్దార్ టీమ్ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే ఇదే విషయంపై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల స్ధాయిని పెంచామని, కొన్ని హాస్పిటల్స్‌కు సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమేనని.. త్వరలోనే వారిని నియమించి పూర్తిస్ధాయిలో వైద్యాన్ని అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అప్‌గ్రేడ్ చేయబడ్డ హాస్పిటల్స్‌లో ముందు సిబ్బందిని నియమించిన తర్వాత ఎక్విప్‌మెంట్ తీసుకువస్తామని తద్వారా రోగులకు వైద్యసేవలు నిరంతరాయంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు మంత్రి ఈటల.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *