త్వరలో రోడ్డెక్కనున్న హైదరాబాద్ సిటీ బస్సులు.. !

కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ప్రజా రవాణ వ్యవస్థను పునరుద్ధరించే పనిలో పడింది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే జిల్లా బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. హైదరాబాద్ సిటీ సర్వీసులను రోడ్డెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 31తో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలైన నేపథ్యంలో.. ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ టాక్సీలకు ఎక్కువ […]

త్వరలో రోడ్డెక్కనున్న హైదరాబాద్ సిటీ బస్సులు.. !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 4:00 PM

కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన ప్రజా రవాణ వ్యవస్థను పునరుద్ధరించే పనిలో పడింది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే జిల్లా బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. హైదరాబాద్ సిటీ సర్వీసులను రోడ్డెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 31తో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలైన నేపథ్యంలో.. ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ టాక్సీలకు ఎక్కువ చార్జీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా సర్వీసులు ప్రారంభించిట్లే.. కరోనా నిబంధనలతో సిటీ సర్వీసులు కూడా ప్రారంభించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో వీటిని ప్రారంభించేందుకు ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న అధికారులు.. బస్సులను తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల 5వ తేదీ నాటికీ అన్ని రకాల బస్సులను నడపాలని భావిస్తున్నారు. కరోనా నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కండక్టర్లు బస్సుల్లో కాకుండా స్టేజీల వద్దే టికెట్లు జారీ చేసే ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులు రూపొందించారు. ప్రతి స్టేజీలో ఇద్దరు చొప్పున కండక్టర్లు ఉండేలా.. ఒకరు టికెట్‌ జారీ చేస్తే, మరొకరు దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేయాలని నిర్ణయించారు. కానీ దీన్ని ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లా సర్వీసుల తరహాలోనే కండక్టర్లతో కూడిన బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. ప్రతి బస్సులో భౌతిక దూరం పాటించేలా చూడాలని, నిలబడి ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వవద్దని సూచించింది. కానీ, సిటీ బస్సులకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎగబడే పరిస్థితి ఉండటంతో నిలబడకుండా చూడటం కష్టసాధ్యమేనని అధికారులు అంటున్నారు. సీట్లు భర్తీ అయ్యాక అదనంగా ఎక్కేవారిని కండక్టర్లు నియంత్రించలేక ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ మహా నగరంలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. దీంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి లాక్‌డౌన్‌ మరింత కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇదంతా భర్తి చేసుకునేందుకు ఆర్టీసీ బస్సులను రోడ్డెక్కించక తప్పదంటున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా వెలుగు చూస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిమిత ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. మరో వైపు ప్రతిరోజు జేబుకు చిల్లుపడ్డట్టు ప్రైవేట్ టాక్సీలు చార్జీలు వసూలు చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఆర్టీసీ బస్సులను త్వరగా రోడ్డెక్కించాలని కోరుతున్నారు ప్రయాణికులు.

ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
ఏపీలో విచిత్ర వాతావరణం.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా IRCTC ప్యాకేజీ
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
అదరగొట్టిన కోహ్లీ, పాటిదార్.. హైదరాబాద్ టార్గెట్ 207
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
Viral: చెరువు దగ్గర మట్టిలో వింత ఆకారం.. తవ్వి చూడగా.!
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
చిరంజీవి మృగరాజు సినిమాలో ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..
రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్.. జేసీబీ డ్రైవర్ నిర్వాకంతో..