రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు షురూ.. ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్న అధికారులు.. పేర్లు నమోదుకు అవకాశం..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి.

రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు షురూ..  ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్న అధికారులు.. పేర్లు నమోదుకు అవకాశం..!
Follow us

|

Updated on: Dec 10, 2020 | 9:53 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు త్వరలోనే విముక్తి లభిస్తుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ ఏర్పాట్లకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కరోనా వ్యాక్సిన్‌ కు అర్హులైన వారు తమ పేర్లను నమో దు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందిస్తోంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది. దీన్ని కోవిడ్‌ యాప్‌గా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, వచ్చేనెల రెండో వారం నుం చి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేసేం దుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటివరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గత రెండ్రోజులుగా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు యాప్‌నకు సం బంధించి సన్నాహాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడత దాదాపు 70 లక్షల నుంచి 75 లక్షల మందికి కరోనా టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు మొదటి దఫా వ్యాక్సిన్ వేయనున్నారు. దాదాపు మొత్తం కలిపి 3 లక్షల మంది వివరాలను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ సేకరించి వివరాలను కేంద్రానికి పంపింది. ఇక, మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వీరే కాకుండా 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారెవరైనా కరోనా వ్యాక్సిన్‌ పొందడానికి అర్హులే అయినందున ప్రభుత్వం రూపొందించే ప్రత్యేక యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పేర్లు నమోదు చేసుకున్నాక అర్హుల జాబితాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ధృవీకరిస్తారు. తుది జాబితా ప్రకారం వ్యాక్సిన్‌ను అందజేస్తామని చెబుతున్నారు. కాగా, మొత్తంగా రాష్ట్రంలో 3 కోట్ల టీకాల ను నిల్వ చేసే సామర్థ్యమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!