కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు.. తాజాగా మార్గదర్శకాల విడుదల.. 100 మంది సీలింగ్‌తో సమావేశాలకు అనుమతి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలుచాస్తోంది. శీతకాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు.. తాజాగా మార్గదర్శకాల విడుదల.. 100 మంది సీలింగ్‌తో సమావేశాలకు అనుమతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 18, 2020 | 10:17 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలుచాస్తోంది. శీతకాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతాయన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తాజాగా వైరస్ వ్యాప్తిని కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అన్‌లాక్ మార్గదర్శకాల్లో పాక్షిక మార్పులు చేస్తూ కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. నాలుగు గోడల మధ్య సామాజిక, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నిబంధనల మేరకు 200 మంది హాల్ సామర్థ్యంలో 50 శాతం హాజరుతో సామాజిక సమావేశాలు అనుమతినిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంః

# సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ కార్యక్రమాలు, ఇతర సమ్మేళనాలకు 100 మంది హాల్ సామర్ధ్యంతో జరుపుకోవడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చారు. # సమ్మేళనాలు రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల మాత్రమే అనుమతిస్తారు. # ఫేస్ మాస్క్‌లు ధరించడం, నిర్ణీత దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. # బహిరంగ ప్రదేశాల్లో భూమి / స్థలం పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని, నిర్ణీత దూరాన్ని కఠినంగా పాటించడం తప్పనిసరి. # ఫేస్ మాస్క్‌లు ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ సదుపాయంతోపాటు హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచడం ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లు అనుమతి. # కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల 100 మంది సీలింగ్‌తో బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్లు, సామాజిక, రాజకీయ, మతపరమైన సమావేశాలు వంటి కార్యకలాపాలను అనుమతి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!