సమత కుటుంబానికి 3 ఎకరాల భూమి.. తెలంగాణ ప్రభుత్వ సహాయం!

ఇటీవల ఆసిఫాబాద్‌లో హత్యాచారానికి గురైన సమత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సహాయమందించింది. ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఖానాపూర్‌ మండం గోసంపల్లిలో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని సమత ఫ్యామిలీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా సమత భర్తకు 3 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే రేఖా నాయక్ అందించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుల్లో సమత హత్యాచారం కేసు కూడా ఒకటి. […]

సమత కుటుంబానికి 3 ఎకరాల భూమి.. తెలంగాణ ప్రభుత్వ సహాయం!
Follow us

| Edited By: Srinu

Updated on: Feb 05, 2020 | 3:45 PM

ఇటీవల ఆసిఫాబాద్‌లో హత్యాచారానికి గురైన సమత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సహాయమందించింది. ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమిని కేటాయిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఖానాపూర్‌ మండం గోసంపల్లిలో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని సమత ఫ్యామిలీకి ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు తాజాగా సమత భర్తకు 3 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే రేఖా నాయక్ అందించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసుల్లో సమత హత్యాచారం కేసు కూడా ఒకటి. గతేడాది నవంబర్ 24న కొమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమతపై అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ.. బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే సమతపై ముగ్గురు మృగాళ్లు హత్యాచారానికి తెగబడ్డారు. కాగా ఇటీవల సమత కేసులోని దోషులకు మరణ శిక్షను విధిస్తూ ప్రత్యేక కోర్టు సంచలనమైన తీర్పునిచ్చిన విషయం విదితమే.